Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Balala Geyalu-Part-3

Balala Geyalu-Part-3

1.జయహే భరతమాత జయహే 
జయహేభరతమాత జయహే , జయహేతెలుగుతల్లి జయహే 
గంగ యమున ఘన గోదావరి జన జీవనదుల తల్లీ 
పాడిపంటలకు పసిడి సీమగా పేరు గాంచెనమ్మా         |జయహ| 
సిరులకు కళలకు నిలయమైన బంగారు తల్లివమ్మా 
నీ కీర్తికాంతి ఈ చరతలో వెదజల్లవె మాతల్లీ                 |జయహ| 
వీరులెందరికో  జన్మనిచ్చిన వీరమాతవమ్మా 
కవులు గాయకులు చిత్రకారులకు కన్నతల్లివమ్మా         |జయహ| 


  • 1._jayahe_bharatha_maatha
  • 2.పయనించు నీలి మేఘం  
    పయనించు నీలి  మేఘం , పాడింది  వాన రాగం |పయనించు| 
    పచ్చని  చేలలో విచ్చిన పూలలో 
    మెరిసింది  ఆమని కురిసింది ప్రేమని |పయనించు| 
    పూలపైన  తుమ్మెదోచ్చి  వాలె తేనె  కోసమే 
    మావిపూవు ఇంటిలోన కోయిలమ్మ వాలెను 
    మల్లె తీగ రమ్మనే మనసు విప్పి పొమ్మనే 
    పల్లె పడుచు పైటలోన పిల్లగాలి  ఝుమ్మనే |పయనించు| 
    మల్లె పూల సోకులన్ని సిగ్గుపడే  తోటలో 
    సన్నజాజి గండుమల్లె సాగిపోయే కాషలో 
    చిత్రకూట రాగము ఇల్లయేరి తాలము 
    పట్టరాని సంబరాన పరుగుతీసె కాలము |పయనించు| 


  • 2._payaninchu_neeli_megham
  • 3.పచ్చపచ్చాని తీగ 
    పచ్చపచ్చాని తీగ  పాకింది  ,ఎర్ర ఎర్రాని పువ్వు పూసింది

    చిన్న చిన్నారి పాప చూసింది , మెత్త మెత్తాని చేయి చాచింది 
    మెల్ల మెల్లగ పువ్వు తుంచింది , నల్ల నల్లాని జడలో ముడిచింది 


  • 3._pachha_pachhani_teega
  • 4.చిన్న చిన్న పిల్లలం చిన్నారి పాపలం  
    చిన్న చిన్న పిల్లలం చిన్నారి పాపలం 
    అన్నా తమ్ముల్లము అక్కా చెల్లెల్లమూ
    అన్నా తమ్ముల్లము అక్కా చెల్లెల్లమూ         |చిన్న| 
    అమ్మ నాన్న ముచ్చట పడ ఆటలు ఆడేము(2) 
    అయ్యవారు మెచ్చుకోనగ పాటలు పాడేము(2) |చిన్న|| 
    ఇరుగు మేరి పొరుగు ప్యారి ఎదురింటి జయసూరి(2) 
    అందరమూ నేస్తాలం ఎన్నడునూ పోరాడం(2) |చిన్న| 


  • 4._chinna_cinna_pillalam

  • 5.గాలిపటం గాలిపటం  
    గాలిపటం గాలిపటం ఏల ఎగిరేవు? , నేల మీద నడవలేక నింగికెగిరాను! 
    రక్కలు లేక ఎగరీఎగరీ ఎక్కడికేల్తావూ? , చుక్కల వద్దకు చక్కగ వెళ్లి చూసివస్తాను! 
    చుక్కల్లోన చందమామకు చ్చిక్కిపోతావు , చందమామకు అందకుండా సర్రున వస్తాను! 


  • 5._galipatam
  • 6.గువ్వా! గువ్వా! 
    గువ్వా! గువ్వా! నీకేల, రెండు కాళ్ళు? , నేల మీద చక చకా నడవటానికి. 
    గువ్వా! గువ్వా! నీకేల, రెండు రెక్కలు? , గగనంలో రెప రెపా ఎగరడానికి. 
    గువ్వా! గువ్వా! నీకేల, గట్టి ముక్కు? , గింజ గిట్ర టక టకా పొడవటానికి. 
    గువ్వా! గువ్వా! నీకేల, చిన్న గొంతు? , పాటలన్నీ కిల కిలా పాడటానికి. 


  • 6._guvva_guvva
  • 7.జామచెట్టు 
    జామచెట్టు  జామచెట్టు  బాగున్నావా ! , జామ చెట్టు  కొమ్మ నుండి జారిపడ్డావా! 
    భయం లేదు భక్తి లేదు , బాయిలో పడితే  లోతు లేదు. 
    ఈత కొమ్మ చాటు లేదు , మిరపకాయ ఘాటు లేదు 
    కారం శనగలు కటకటా , అత్త పాణం మిటమిటా! 


  • 7._jamachettu
  • 8.చీమా! చీమా! వస్తావా? 
    చీమా! చీమా! వస్తావా? , సనిమాకెళ్దాం వస్తావా? 
    పరీక్షలయ్యా బాలయ్యా! , బాగా చదువుకోవయ్యా! 
    పచుకా! పచుకా! వస్తావా? ,పిక్చెర్కెల్దాం వస్తావా? 
    పరీక్షలమ్మా పాపమ్మా! , బలగా చదువుకోవమ్మా! 
    చిలకా! చిలకా! వస్తావా? , షికారుకెళ్దాం వస్తావా? 
    పరీక్షలండ్రా ,బాలల్లూ! బాగా చదువుకోండర్రా! 


  • 8._cheema_cheema_vastava
  • 9.కోడి పిల్లలు 
    కోడిపల్లలు అమ్మ చుట్టూ , ఆడుకుంటూ ఉన్నాయి 
    నల్ల పిల్లి గోడ వెనుక , నక్కి నక్కి పొంచుంది 
    నింగినుండి పెద్ద గద్ద , నేల మీదకు చూసింది 
    పిల్లి చెంగున దూకింది , గద్ద రివ్వున వాలింది 
    ఒక్కేసారి పిల్లి గద్దా, డిక్కీ డిక్కీ డీ కొన్నాయి 
    పల్లికి కన్ను పోయింది , గద్దకు రెక్కవిరిగింది 
    మ్యావ్ మ్యావ్  పిల్లి , కివ్ కివ్ గద్ద 
    నవ్వీ నవ్వీ కోడిపిల్లలు ,నాట్యమాడుతున్నాయి .


  • 9._kodipillalu_pavan

  • Balala Geyalu-Audios-1.balala geyalu..balala geyalu in telugu.balala geyalu in telugu lyrics.balala geyalu in telugu lyrics pdf,telugu balala geyalu pdf,balala geethalu in telugu.balala telugu patalu.school telugu geyalu. telugu childrens songs.telugu balala geyalu,children folk songs.telugu childrens folk songs.
    Previous
    Next Post »
    0 Komentar

    Google Tags