Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Balala Geyalu-Part-4

Balala Geyalu-Part-4

1. ఓ యువతి యువకుల్లారా
 ఓ యువతీ యువకుల్లారా
 సామాజపు సారధులారా
 ఈ దేశానికి మీరే యుగకర్తలు కావాలి
 రేపటి తరానికి మీరే మార్గదర్శకులవ్వాలి  |ఓయువతీ|
 పేదరికం ఒక శాపం కాదు ఎవరి నుదుటా అది రాసి లేదు
 ఏదో గ్రహణం పట్టింది- బ్రతుకును చీకటి అలుముకుంది
 ఆ చీకటిని తరిమేసే కాంతి రేఖలుకావాలి
 బ్రతుకు బాటను చూపాలి  |ఓయువతీ|
 కూడూ  గూడూ లేక పడియున్న  దీనులకు
 ఎవరొస్తారని అలసిపోయిన  అభాగ్య జీవులకు
 మేమున్నామని చెప్పాలి- నమ్మకాన్ని పెంచాలి
 ఎవరికి వారే బ్రతికే టందుకు శక్తిని మనమే ఇవ్వాలి  |ఓయువతీ|
 ఎందరో వీరుల త్యాగ ఫలం ఈ దేశానికి స్వాతంత్రం
 మనకెందుకులే అనుకుంటే  ఏమయ్యేదో ఈ దేశం
అదే స్ఫూర్తి మీలో ఉంటే-  అందరమొక్కటే అనుకుంటే
 సమసమాజ నిర్మాతలు మీరై సమానత్వమే చూపాలి
 సహజీవనమే  చెయ్యాలి  |ఓయువతీ|


 • 1._o_yuvathi
 • 2.పెద్ద వంకలో గంగమ్మ తల్లి
   పెద్ద వంకలో గంగమ్మ తల్లి గల గల పారాలి
   ఏరువాక లో ఎంకి పాట తో నాగలి నవ్వాలి
   సాలు సాలుకు నేల తల్లికి పువ్వులు పూయాలి
   బీడు భూముల్లో పంటల  పండుగ నిండుగ జరగాలి
   కదిలి రావమ్మా గంగమ్మ తల్లి రైతు కంట నీరు తుడవాలి తల్లి
   కరువు సీమకు కదలి రావమ్మా, పెద్ద వంకగా   పారాలమ్మా
   పల్లె పల్లెల్లో...... ఓ.... హోయ్
   పల్లె పల్లెల్లో రైతులు కదిలి నీ రాకకై చూస్తారమ్మా
   సాలు సాలుకు నీ సాయంతో వ్యవసాయాన్ని చేస్తారమ్మా |పెద్ద|
   పెద్ద వంకలో పాడేటి  నీటిలో నెల వంక చూసి మురిసిపోవాలి
   కాల్వల్లో  నీరు పరుగులు తీస్తూ  కయ్యలో నీరు నిలిచిపోవాలి
   బీడు భూములన్నీ....... ఓ....  హోయ్
   బీడు భూములన్నీ తడితో తడిపి నేలకు నీరును నింపాలమ్మా
   బోరుబావుల్లో నీళ్లను నింపి భూగర్భ జలాలు పెంచాలమ్మా|పెద్ద|
   రైతు గుండెకు దిగులే వద్దు దిగుబడులెన్నో పెంచలమ్మా
   నల్ల రేగళ్ల లో నేలకొంగిన పంటలెన్నో పెరగాలమ్మా
   కరువు భూమిలో.... ఓ...........  హోయ్
   కరువు భూమిలో రైతుల కంతా మెతుకు ముద్దను అందించమ్మా
   అన్నదాతకు అమ్మవు నీవే అన్నపూర్ణగా కొలిచామమ్మా |పెద్ద|
   అప్పులు తిప్పలు తీరిపోవాలి ఉప్పెన  వంకగ పారాలమ్మా
   ఎర్రగుడి లో  గుడినే కడతాం- బెల్లం ఎంకన్ని అల్లుకుపోమ్మా
   ఊటకల్లులో ఊటగ ఊరి పూటకు పూటకు పారాలమ్మా
   జొన్నగిరి లో జల జల రాలుతూ, ధాన్యపు రాశులు పండాలమ్మా |పెద్ద|


 • 2._pedda_vankalo_gangammatalli
 • 3. చందమామా  చందమామా
   చందమామా చందమామా చక్కనైన చందమామా!
   మళ్లీ అడుగుతున్నా మల్లి మాట చెప్పు మామా!
   ఇంటి ముందర మనమంతా వనములో మనమంతా 
  మళ్లీ అడుగుతున్నా మల్లి మాట చెప్పు మామా!
  చందమామా చందమామా చక్కనైన చందమామా!
  ఏంటమ్మామళ్లీ అడుగుతున్నా మల్లి మాట చెప్పు మామా!
  చక్కనైన చందమామమా  ఏ చుక్కల్లోదాగుందో!
  నీకు తెలిసి ఉంటే నాతో చెప్పి పోరా మామా!


 • 3._chandamama
 • 4. అడవుల కొండల గుట్టలకూ
  అడవుల కొండల గుట్టలకూ చందమామయలో......చందమామయలో
   నిప్పు పెట్టితే మనకే ముప్పుచందమామయలో |అడవుల|
   ఎండు కట్టెల కోసం మనమూ చందమామయలో.......చందమామయలో
   మంటలు ఎగదోస్తున్నామూ చందమామయలో.......చందమామయలో
   అడవులు కొండలు కాల్చుకు పోతే చందమామయలో...చందమామయలో
   వానలు మనకు కరువై పోతాయ్ చందమామయలో...చందమామయలో |అడవుల|
   అడవుల కొండల సరిహద్దుల్లో చందమామయలో...చందమామయలో
   బీడీ, సిగరెట్, అగ్గి పుల్లలు--చందమామయలో...చందమామయలో
   ఆర్పకుండా  విసిరెయ్యోద్దు చందమామయలో...చందమామయలో
   అడవులంటే అన్నదాతలుచందమామయలో...చందమామయలో |అడవుల|


 • 4._adavulakondala

 • 5.అందాల మా ఇల్లు
   అందాల మా ఇల్లు, ఆనందాల హరివిల్లు(2)
   ఇంటి ముందర బాట, ఇంటి వెనుక తోట
   మా ఇల్లు ఒక కోట, గర్విస్తుంది మా పేట                  |అందాల మా ఇల్లు|
   అమ్మా నాన్న అన్నయ్య, తాతా బామ్మా మామయ్య
   జూలీ డాలీ రంగయ్య, మా ఇంట్లోని వాళ్ళయ్య              |అందాల మా ఇల్లు|
   శాంతికి నిలయం మా ఇల్లు, ప్రేమకు వలయం మా ఇల్లు
   స్వచ్ఛత అంటే మా ఇల్లు, క్రమశిక్షణకు మా ఇల్లు            |అందాల మా ఇల్లు|
   ఇంటికి  రాజు మా నాన్న, నాన్నకు తోడు మా అమ్మ
   ఇంటికి రాని మా అమ్మ,  అమ్మకు తోడు అమ్మమ్మ |అందాల మా ఇల్లు|

 • 5.andaala
 • 6. ఎక్కడెక్కడో పుట్టాము
   ఎక్కడెక్కడో పుట్టాము ఎక్కడెక్కడో పెరిగాము(2)
   అనుకోకుండా  కలిసాము అందరమోకటిగ ఉన్నాము(2)
   మేమంతా ఒక గూటి పక్షులం
   టింబక్టు వృక్షం పైన చిగురించని                                  | ఎక్కడెక్కడో|
   అమ్మానాన్నా మాకున్నా అన్నా తమ్ముళ్లు మాకున్నా 
   ఆటలు పాటలు అన్నీ ఉన్న టింబక్టు బడి మాకు మిన్న
   ఒకరికి ఒకరం తోడుంటాం టింబక్టుబడి లో కలిసుంటాం | ఎక్కడెక్కడో|
   కులమంటే తెలియదు మాకు మతమంటే చిరాకు మాకు
   స్నేహానికి ప్రాణం ఇస్తాం  సహవాసానికి మేమే రూపం
   కలిసికట్టుగా ఉంటాము ఆనందంగా జీవిస్తాం                | ఎక్కడెక్కడో|


 • 6.ekkadekkado_puttamu
 • 7. ఓ..... తంగేడుపూత నేరేడుకాత
  ఓ..... తంగేడుపూత నేరేడుకాత గువ్వల మోత కోయిల కూత
   అడవి తల్లికి అందమయ్యింది ఈ అడవి కంటే స్వర్గమేడుంది | ఓ..... తంగేడుపూత|
   పువ్వుల  పైన తుమ్మెద రాగం తీయని పాటలు తలపిస్తుంటే
   సెలయేటి దూకుడుల్లో మద్దెల మోతలు వినిపిస్తుంటే
   పిల్లగాలికి పచ్చని చెట్లు నాట్యం రీతి కదులుత ఉంటే
   ఆ సుందర దృశ్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవన్నా | ఓ..... తంగేడుపూత|
   ప్రకృతి ఇచ్చిన ఆశలల్లే  గండుశిలల బారులు చూడు
   బెదురు చూపులతో వాటిపై ఎగిరే లేడీ పిల్లల గుంపులు చూడు
   తోడు కోసం రెప్పలు రొప్పే ఎలుగుబంటి అరుపులు చూడు
   నెచ్చెలికోసం నాట్యం చేసే నెమలి పించపు రంగులు చూడు | ఓ..... తంగేడుపూత|
   అమ్మ వోలే ఆకలి తీర్చే తియ్యని ఫలములు ఇచ్చే చెట్లు
   ఎన్నో జీవుల అక్కున చేర్చి ఆదరించే దేవతలట్లు
   రాణి కోట్లను రక్షించేటి ప్రాణవాయువును అందిస్తాయి
   తల్లిని పోలిన గొప్పది చెట్టు తట్టి చూడు మది నీకే తట్టు       | ఓ..... తంగేడుపూత|


 • 7._tangeedupuuta

 • Balala Geyalu-Part-4,balala geyalu..balala geyalu in telugu.balala geyalu in telugu lyrics.balala geyalu in telugu lyrics pdf,telugu balala geyalu pdf,balala geethalu in telugu.balala telugu patalu.school telugu geyalu. telugu childrens songs.telugu balala geyalu,children folk songs.telugu childrens folk songs.
  Previous
  Next Post »
  0 Komentar

  Google Tags