Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

National Girl Children's Day Week Programs - Prakasam DEO's Press Note 2019

National Girl Children's Day Week Programs - Prakasam DEO's Press Note


జిల్లా లోని మండల విద్యాశాఖాధికారులకు తెలియచేయునది ఏమనగా ప్రకాశం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, ఒంగోలు వారు ఉత్తర్వులు Rc.No. 111/lCPS, PRK/2018, తేది: 19.01.2019 ప్రకారం మన జిల్లా యందు ఆడబిడ్డను రక్షిద్దాం - ఆడబిడ్డను చదివిద్దాం (BBBP) పధకం అమలు జరుగుచున్నందున, అందులో భాగం గా జనవరి-24, 2019 తేదీని జాతీయ బాలికా దినోత్సవంగా జరుపుకుంటున్నందున తేది: 21.01.2019 నుండి 26.01.2019 వరకు జాతీయ బాలికా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించవలసిందిగా భారత ప్రబుత్వం వారు అదేశించియున్నారు. మరియు వారోత్సవాల సందర్భముగా నిర్వహించదగిన కార్యక్రమాల వివరాలు ఈ క్రింది . విధముగా తెలియ చేయడమైనది.


ప్రకాశం జిల్లా నందలి రాచర్ల మండలం జాతీయ స్థాయి లో అతి తక్కువ లింగ నిష్పత్తి కలిగి ఉన్నందున మరియు టంగుటూరు మరియు మర్రిపూడి మండలాలు, జిల్లా లో తక్కువ లింగ నిష్పత్తి కలిగి యున్నందున ఈ మూడు మండలాల యందు అన్ని శాఖల సమన్వయంతో జాతీయ, బాలిక దినోత్సవ వారోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించ వలసిందిగా కోరడమైనది.
కావున, జిల్లా లోని అన్ని యాజమాన్యాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 22.01.2019 స పాఠశాలలో ఆడబిడ్డను రక్షిద్దాం - ఆడ బిడ్డను చదివిద్దాం అనే నినాదం తో వ్యాస రచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించి మొదటి, రెండవ, మూడవ స్థానాలలో నిలిచిన విద్యార్థుల పేర్లను అదే రోజు మండల విద్యాశాఖాధికారులకు సమర్పించ వలెను. మండల విద్యాశాఖాధికారులకు తెలియచేయునది ఏమనగా 23.01.2019 న మండల స్థాయి లో అడబిడ్డను రక్షిద్దాం - ఆడ బిడ్డను చదివిద్దాం అనే నినాదం తో వ్యాస రచన, చిత్ర లేఖనం వంటి పోటీలు నిర్వహించి మొదటి, రెండవ, మూడవ స్థానాలలో నిలిచిన విద్యార్ధుల పేర్లను అదే రోజు సంభందిత ఐసిడియస్ సిడిపిఒ లకు అందించిన యెడల 24 వ తేది జరుగు జాతీయ బాలికా దినోత్సవ వేడుకలందు బహుమతి ప్రదానం జరుగుతుంది. మరియు పై పెడ్యులు ప్రకారం ప్రతి కార్యక్రమం లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బందితో సహకరించ వలసిందిగా మండల విద్యాశాఖాధికారులకు మరియు ప్రదానోపాద్యాయులకు తెలియచేయడమైనది,
జిల్లా యందు వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచిన బాలికల యొక్క వివరములను జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ, ఒంగోలు వారి కార్యాలయమునకు అందచేసిన యెడల 24 వ తేది జరుగు' జాతీయ, బాలికా దినోత్సవము జిల్లా స్థాయి కార్యక్రమము నందు సన్మానించుట జరుగునని తెలియచేయడమైనది.
ప్రతిజ్ఞ

............. అనే నేను మంచిగా చదువుకొని ఉన్నత విద్యను అభ్యసిస్తాను. నేను 18 సంవత్సరముల లోపు వివాహం చేసుకోను. నా తల్లిదండ్రులు కానీ ఇతర బంధువులు కానీ దానికి ప్రోత్సహించినా వెంటనే చైల్డ్ లైన్ 1098 మరియు డయల్  100  కి ఫోన్ చేసి సమాచారం ఇస్తాను. నేను ఎవరి చేతిలో మోసపోనని,  ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ప్రవర్తిస్తాను. నా ప్రాంతంలోని స్నేహితులపైన ఏమైనా అఘాయిత్యాలు జరిగిన వారికి సహాయంగా ఉంటానని. అట్టి సమాచారాన్ని వెంటనే లైన్ 1098 కి అందిస్తానని ఈ జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను.

Download.......National Girl Children's Day Week Programs Press Note
Download.....ప్రతిజ్ఞ
Download.....మహిళలుతెలుసుకోవలసిన చట్టాలు
National Girl Children's Day Week Programs - Prakasam DEO's Press Note,National Girl Children's Day Week Programs,National Girl Children's Day Week Programs Press Note,Girl Children's Day Week Programs,press note on Girl Children's Day Week Programs 2019,National Girl Children's Day Week Programs 2019 ,జాతీయ బాలికా దినోత్సవం వారోత్సవాల కార్యక్రమాలు మరియు ప్రతిజ్ఞ,jateeya baalika dinotsava programs and prathigna,
Previous
Next Post »
0 Komentar

Google Tags