Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 25th January Information

School Assembly 25th January Information
నేటి ప్రాముఖ్యత
జాతీయ ఓటర్ల దినోత్సవము
ఇండియా పర్యాటకం దినోత్సవం
ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1905: ప్రపంచంలోని అతిపెద్దదైన 3106 క్యారెట్ల కల్లినన్ (Cullinan) వజ్రం దక్షిణ ఆఫ్రికా గనుల్లో కనుకొనబడింది.
1918: రష్యన్ సామ్రాజ్యం నుండి "సోవియట్ యూనియన్" ఏర్పడింది.
1939: చిలీ దేశంలో వచ్చిన భూకంపంలో దాదాపు పదివేల మంది మరణించారు.
1971: హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
నేటి అంశము:
భారతరాజ్యాంగం
భారతదేశంలో ప్రభుత్వ నిర్మా ణము, పరిపాలనా విధానం భారత రాజ్యాంగమును బట్టి జరుగు తుంది. భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబరు 26వ తేదీన ఆమోదించింది. భారత రాజ్యాంగము 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగములో
1) ప్రవేశిక
2) 1 నుండి 22 భాగాలలోని 400 ప్రకరణాలు
3) 12 షెడ్యూళ్ళు
4) ఒక అనుబంధము ఉన్నవి.
మంచి మాట/సుభాషితం:
ఆటంకాలెదురయ్యే కొద్దీ మనం మరింత దృఢంగా ఆ పనిని పూర్తి చెయ్యాలనే పట్టుదలను పొందాలి- బ్రూస్‌లీ
వార్తలలోని ముఖ్యాంశాలు
*సంక్షేమ పథకాల అమలు, పనితీరును పరిశీలించేందుకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పర్యటించాలని ఏ.పి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు.
*ఇండియా టుడే ‘మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌’ పేరిట జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో వైఎస్‌ జగన్‌  బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎంల జాబితాలో నాలుగో స్థానాన్ని సాధించారు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ నిలిచారు.
*యువత వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తూ సమాజ ప్రగతిలో కీలక పాత్ర పోషించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ భూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు.
*తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. తొలి ఫలితం ఉదయం 10 గంటల కల్లా వెల్లడే అవకాశం.
*ఏక కాలంలో లక్ష మంది ధ్యానం చేసేలా హార్ట్‌ఫుల్‌నెస్‌అనే సంస్థ అత్యాధునిక వసతులతో హైదరాబాద్‌ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం 28న ప్రారంభం కానున్నది.
*కృష్ణా నదీ పై అమ్రాబాద్‌ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం ప్రతిపాదనలు తెలంగాణ సీఎం కేసిర్ కు అందజేసింది.
*పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై అధికారులు జాతీయ భద్రతా చట్టాన్ని (ఎన్‌ఎస్‌ఏ) ప్రయోగించకుండా ఆదేశాలివ్వలేమని సుప్రీం కోర్టు పేర్కొంది.
*ఆక్స్‌ ఫర్డ్‌ తన లేటెస్ట్‌ ఎడిషన్‌ డిక్షనరీలో 26 కొత్త భారతీయ ఆంగ్ల పదాలను చేర్చింది. అందులో ఆధార్, చావల్, డబ్బా, హర్తాళ్, షాదీ వంటి పదాలకు చోటు కల్పించింది.
*విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ యువతకు సందేశమిచ్చారు.
*చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ సోకి మృతి చెందిన వారి సంఖ్య 26కి చేరుకుంది.
*న్యూజిలాండ్‌ లో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. న్యూజిలాండ్‌ యొక్క 200 పైచిలుకు లక్ష్యాన్ని భారత్‌ 19 ఓవర్లలోనే ఛేదించింది.

*ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో నయోమి ఒసాకా (జపాన్‌), సెరెనా విలియమ్స్‌ (అమెరికా), కరోలిన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌)లు మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌ లో ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), జొకోవిచ్‌ (సెర్బియా) సులువుగా మూడో రౌండ్‌ను దాటారు.
School Assembly 25th January Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news
Previous
Next Post »
0 Komentar

Google Tags