Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School Assembly 2nd January information

School Assembly 2nd January information


నేటి ప్రాముఖ్యత
ప్రపంచ శాంతి దినోత్సవం
చరిత్రలో ఈరోజు
1954 వసం.లో భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.
మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు కె.ఎం.మాథ్యూ 1917 వ సం.లో జన్మించారు.
తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు బత్తిని మొగిలయ్య గౌడ్ 1918 వ సం.లో జన్మించారు.
పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు గ్రంథకర్త ఓగేటి అచ్యుతరామశాస్త్రి 1932వ సం.లో జన్మించారు.
భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు మహారాణి చక్రవర్తి 1937 వ సం.లో జన్మించారు.
ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత వసంత్ గోవారికర్ 2015 వ సం.లో మరణించారు.
నేటి అంశము:
మూలకాల వర్గీకరణ
శాస్త్రజ్ఞులు ఇప్పటివరకు సుమారు 110 మూలకాలను కనుగొన్నారు. ఇన్ని మూల కాలను, అవి ఏర్పరచే సమ్మేళనాల లక్షణాలను గుర్తుంచు కోవడం కష్టసాధ్యమని తలంచి 1869వ సంవత్సరంలో మెండలీఫ్ అనే శాస్త్రజ్ఞుడు మూలకాల భౌతిక, రసాయన ధర్మాలు, వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలని తెలియజేశారు. మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణా క్రమములో అమర్చి తొలిసారిగా సంక్షిప్త ఆవర్తన పట్టికను తయారు చేశారు.
సుభాషితం:
అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తీయగనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ
భావం - పాడగా పాడగా రాగం వృద్ది అవుతుంది.తినగా తినగా వేపాకు కూడా తియ్యగా ఉంటుంది.అలాగే దృడ సంకల్పంతో పట్టుదలతో చేపట్టిన పని చెయ్యగా అది తప్పకుండా సమకూరుతుంది.
నేటి సూక్తి
ఆలోచన లేని చదువు వ్యర్థం. చదువులేని ఆలోచన ప్రమాదభరితం.
నేటి జి కె
ప్ర.ఆధార్‌కార్డ్‌ చిహ్నం రూపొందించినవారు ఎవరు?

జ:సుధాకరరావు పాండే


వార్తలలోని ముఖ్యాంశాలు
విలీన ప్రక్రియ పూర్తి కావడంతో ఏపిఎస్ఆర్టీసీ కార్మికులు జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.
తిరుమలలో సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని, వైకుంఠ ఏకాదశి నుంచి తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికీ స్వామివారి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందించబోతున్నట్లు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అన్ని గ్రామ పంచాయితీలలో ఈచ్‌ వన్‌ టీచ్‌వన్‌చేపట్టేందుకు అవసరమైన 18 సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యుల జాబితాను ఈనెల 10వతేదీలోగా నమోదు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
రాజ్‌భవన్ వేదికగా ప్రజా సమస్యలకు సబంధించిన వినతిపత్రాలు స్వీకరించి... పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు.
ఆర్థిక మందగమనం నెలకొన్నా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెల డిసెంబర్‌లోనూ రూ. లక్ష కోట్లు దాటాయి.
ఇక చైనాతో సరిహద్దు సమస్యలకు త్వరలోనే శాశ్వత సానుకూల పరిష్కారం లభిస్తుందని నూతన ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ముకుంద్‌ నరవనే ఆశాభావం వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేయకుండా ఏ ఒక్కరాష్ట్రం తప్పించుకోలేదని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
ఒక దేశం-ఒకే రేషన్‌ కార్డు సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో బుధవారం ప్రారంభించింది. ఈ 12 రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ లబ్ధిదారులు వారు ఏ రాష్ట్రంలో నివసిసున్నా తమ రేషన్‌ వాటాను పొందే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది.
చంద్రయాన్‌-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ తెలిపారు. చంద్రయాన్-3లో ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ రోవర్ ఉంటాయని అన్నారు.
తమ సైనికులెవరూ తమ అధికారిక మొబైల్ ఫోన్లలో టిక్‌టాక్ ఉపయోగించొద్దని అమెరికా నేవీ ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది.


పైన తెలిపిన సమాచారం మొత్తం వాయిస్(voice) రూపంలో వినిపించడానికి క్రింద ఇచ్చిన ప్లే బటన్ ఫై క్లిక్ (click)చేయండి.

సూచన:ఈ ఆడియో లోడ్ అవ్వడానికి ఆయా నెట్వర్క్ స్పీడ్ ఆధారంగా కొంత సమయం పట్టవచ్చు.


  • SCHOOL ASSEMBLY:2nd January(నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈరోజు,నేటి అంశము,సుభాషితం)

  • School Assembly 2nd January Information, School Assembly,prayer songs, Assembly information,historical events, information of the day, news of the day, golden words ,today golden words,moral sentences,today's importance,headlines in the news,January month school assembly day wise,January 2019 school assembly,January 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd January 2019 assembly, 2nd January 2019 assembly,news of the day history,news of the day highlights,2nd dec 2019 assembly, dec 2nd assembly, dec 2nd historical events, 2nd January 2019 assembly, january 2nd assembly, january 2nd historical events,school related today assembly,school related today news, school related january 2nd information, school related january month information, School Assembly 2nd Jan Information,School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,Jan month school assembly day wise,Jan 2019 school assembly,Jan 2019 school assembly information, today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు, 2nd Jan 2019 assembly, 2nd Jan 2019 assembly,news of the day history,news of the day highlights,2nd dec 2019 assembly, dec 2nd assembly, dec 2nd historical events, 2nd Jan 2019 assembly, jan 2nd assembly, jan 2nd historical events,school related today assembly,school related today news, school related jan 2nd information, school related jan month information
    Previous
    Next Post »

    1 comment

    Google Tags