Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CM JAGAN COMMENTS ON AMMA VODI , EDUCATION SYSTEM

సీఎం జగన్‌ 'అమ్మ ఒడి' పథకం పై స్పందన

★ పిల్లలను బడికి పంపించేలా తల్లులను ప్రోత్సహించేందుకే అమ్మఒడి పథకం పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
★ ఆంధ్రప్రదేశ్‌ నిరక్షరాస్యత సగటు (33శాతం) జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని వెల్లడి. ఈ పథకంతో రాష్ట్రంలో అక్షరాస్యత పెరుగుతుందని, పిల్లలను స్కూల్‌కు పంపే ప్రతి తల్లికి అమ్మఒడి పథకం వర్తింపచేస్తామని సీఎం వ్యాఖ్య.
★ ‘జనవరి 26న అమ్మ ఒడి చెక్కుల పంపిణీని గ్రామ వాలంటీర్ల ద్వారా నిర్వహించాలి. నాకు అత్యంత ప్రాధాన్యమైన దాంట్లో విద్యా రంగం ఒకటి. స్కూల్స్‌ ఫొటోలు తీసి పంపించండి. వాటిని అభివృద్ధి చేస్తాం.
★ ఫ్యాన్లు, ఫర్నిచర్, ప్రహరీ గోడ, బాత్‌రూమ్స్‌ అన్ని బాగుచేస్తాం. ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియం స్కూలుగా మారుస్తాం.
★ తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తాం. యూనిఫారంలు, పుస్తకాలు సకాలనికే ఇస్తాం. పిల్లలకు షూలు కూడా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం.
★ మధ్యాహ్న భోజనంలో కూడా నాణ్యత పెంచుతాం. ఇవన్నీ చేశాక ఏ పిల్లాడు కూడా ప్రైవేట్‌ స్కూల్‌కు పోవాలనే ఆలోచన రాకూడదు.
★ ప్రైవేట్‌ స్కూల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం చేసిన విద్యాహక్కు చట్టాన్ని 100 శాతం అమలు చేస్తాం.
★ ప్రైవేట్‌ స్కూళ్లలో 25 సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. దేశంలో విద్య అనేది సేవేకాని, డబ్బు ఆర్జించే రంగం కాదు.
ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదు.
★ కలెక్టర్ల సమావేశంలో అధికారులను ఉద్దేశించి  ఏపీ సీఎం పై విధంగా స్పందించడం జరిగింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags