Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central budget 2019 highlights

Central budget 2019 highlights


కేంద్ర బడ్జెట్‌-2019 ముఖ్యాంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌-2019
ముఖ్యాంశాలు
√ 2014-15తో పోలిస్తే, ఆహార భద్రతకు రెట్టింపు నిధులు
√ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం భారత్‌ 2.5లక్షల డాలర్ల ఆర్థిక వ్యవస్థగల దేశంగా మారింది
√ఒకే దేశం.. ఒకే గ్రిడ్‌ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం.
√ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తాం.
√పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం.
√ఒకే కార్డుతో బస్‌ ఛార్జీలు, పార్కింగ్‌ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన చేస్తున్నాం.
√ప్రధాన మంత్రి కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా 'చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం' తీసుకువస్తాం.
√ఎలక్ట్రిక్‌ బైక్‌లు, కార్లు, వాహనాలు కొనేవారికి రాయితీలు కల్పిస్తాం
√ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ
√అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నాం. 1.9కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోంది.
√మహత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అంత్యోదయ పథకం మరింత విస్తరణ.
√జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) ప్రవేశపెడుతున్నాం.
√‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.

√లక్షా25వేల కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తాం. పర్యావరణహితంగా 30 వేల కిలోమీటరల​ రహదారిని మార్చుతాం
√జాతీయ విద్యా విధానంలో కొత్త మార్పులకు శ్రీకారం పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.
√పరిశోధనల ప్రోత్సహించడానికి జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం.
√స్టడీ ఇన్‌ ఇండియాలో భాగంగా విదేశీ విద్యార్థులు భారత్‌కు వచ్చి చదువుకునే అవకాశం.
√ఖేల్‌ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం.
√ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు 256 జిల్లాల్లో జల్‌శక్తి అభియాన్‌ పథకం.
√జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం
√ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ.
√భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు.
√ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్స్‌, మీ ఇంటి ముందుకే బ్యాంకు సేవలు రానున్నాయి.
√స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం
√ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణకు నిర్ణయం
√చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేలు తీసుకొస్తాం
√రూ.5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
√విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తగ్గింపు.
√వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు
√మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి ప్రోత్సాహకంగా వడ్డీ రాయితీ రూ.2లక్షల నుంచి రూ.3.50లక్షలకు పెంపురూ.(45లక్షలు లోపు గృహరుణాలపై)
√బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ.కోటి నగదు ఉపసంహరణ పరిమితి. రూ.కోటి దాటితే 2శాతం టీడీఎస్‌.
√5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు
√బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంపు
√డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపు.
√ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతా కలిగిన ఖాతాదారు అన్ని పీఎస్‌యూ బ్యాంకు సేవలను అందుకునేలా చర్యలు
√ఆంధ్రప్రదేశ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రూ.13కోట్లు
√ఐఐటీ హైదరాబాద్‌కు ఈపీఏ కింద రూ.80కోట్లు
√నగదు రహిత చెల్లింపులపై ఎండీఆర్‌ ఛార్జీలు పూర్తిగా రద్దు 
Previous
Next Post »
0 Komentar

Google Tags