Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ISRO Online quiz competition

ISRO Online quiz competition
ఇస్రో ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు వివరాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విద్యార్థులకు అంతరిక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు MyGov.in సమన్వయంతో ఈ నెల 10న ఆన్‌లైన్‌ క్విజ్‌ పోటీలు నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 8-10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులని ఇస్రో అధికారులు తెలిపారు. క్విజ్‌లో పాల్గొనేవారు MyGov.in వెబ్‌సైట్‌లో ముందుగా వ్యక్తిగత ఖాతాను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తరువాత ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఒకరు ఒక్కసారి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.
క్విజ్‌ వ్యవధి 5 నిమిషాలు(300 సెకండ్లు). ఈ సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. దేశంలోని విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. తక్కువ సమయంలో సరైన సమాధానాలు ఇచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరేసి చొప్పున విజేతలను ఎంపిక చేస్తారు. వారిని బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి ఆహ్వానించి, సెప్టెంబరు 7న జాబిల్లిపై దిగే ల్యాండర్‌ను ప్రధాని మోదీతో కలసి వీక్షించే అవకాశం కల్పిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags