Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Check your YSR rythubharosa status

Check your YSR rythubharosa status


వైఎస్సార్‌ రైతు భరోసా అర్హులో.. కాదో తెలుసుకోండి..
వైఎస్సార్‌ రైతు భరోసాలో అర్హత సాధించిన రైతులు తమ వివరాలను వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. http://ysrrythubharosa.ap.gov.in  వెబ్‌సైట్‌లో ఆధార్‌ నంబరు నమోదు చేయడం ద్వారా రైతుల పట్టాదారు పాసుపుస్తకం నంబర్లతో అర్హతను పరిశీలించుకోవచ్చు. ఒకవేళ నగదు చెల్లింపు కోసం బ్యాంకుకు పంపి ఉంటే ఆ వివరాలూ తెలుసుకోవచ్చు.
YSR రైతు భరోసా రైతులకు ముఖ్య సందేశం
18.10.2019 నాటి - YSR రైతు భరోసా pdf  files -రెవిన్యూ గ్రామం వారిగా + ఖాతా నెంబర్ వారీగా పంపిస్తున్న జాబితాలో  కారణం  దగ్గర కింద తెలిపిన విధంగా ఉంటుంది.
1) payment success -  వీరికి జాబితాలో తెలుపబడిన బ్యాంకులో   వారియొక్క బ్యాంక్ ఖాతాలో  డబ్బులు జమ అయినవి.
2) belongs to beneficiary family- ఇలా ఉంటే వీరి యొక్క కుటుంబం లో మరొకరికి (కుటుంబ సభ్యుడికి) డబ్బులు జమ  అయ్యుంటుంది.
3) sent for bank & approved will sent for bank in next schedule -  వీరి వివరాలను, డబ్బులు జమ చేయుట కొరకు ఆర్.టి.జి.ఎస్ వాళ్లు బ్యాంకుకు పంపి ఉన్నారు.(24 వ తేదీ లోపు డబ్బులు రాని యెడల వ్యవసాయ శాఖ కార్యాలయం లో అర్జీ తక్షణం ఇవ్వగలరు)
4) Reject at village level -   దీనికి మూడు కారణాలు
       4A)  PSS name   దగ్గర NA (Not Available) అని ఉంటే - వీరికి ప్రజా సాధికార సర్వే జరగలేదు. మీ వీఆర్వో దగ్గర తక్షణం చేయించుకోండి.
       4B)పట్టాదారు  పేరు మరియు పి. ఎస్. ఎస్  పేరు రెండు వేరు వేరుగా ఉంటే రిజెక్ట్ చేయబడినది .దీని కొరకు మీ వి. ఆర్.ఓ ని కలిసి మీ భూమి రికార్డు కి మీ యొక్క ఆధార్ నెంబర్ ని లింక్ చేసుకోగలరు.
       4C)పట్టాదారుని పేరు పి.ఎస్. ఎస్ పేరు  ఒకటే అయ్యుండి రిజెక్ట్ చేయబడినది .మీ యొక్క బ్యాంకు ఖాతా వివరాలు వాలంటీర్ ద్వారా వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందించగలరు.
5) Reject at Mandal level- పట్టాదారు  పేరు మరియు పి. ఎస్. ఎస్  పేరు రెండు వేరు వేరుగా ఉంటే రిజెక్ట్ చేయబడినది .దీని కొరకు మీ వి. ఆర్. ఓ ని కలిసి మీ భూమి రికార్డు కి మీ యొక్క ఆధార్ నెంబర్ ని లింక్ చేసుకోగలరు.
6) Aadhaar number not available in webland - వీరికి ప్రజా సాధికార సర్వే జరగలేదు. మీ వీ.ఆర్వో దగ్గర తక్షణం చేయించుకోండి.(పక్క రాష్ట్రం లో చిరునామాతో ఉన్న రైతులు కొద్దీ రోజులు వేచి ఉండగలరు).
7) income tax -  వీరు ఇన్కమ్ టాక్స్ , GST కట్టినవారు. ఒకవేళ ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే వ్యవసాయ శాఖ కార్యాలయంలో అర్జీ రూపంలో తెలుపగలరు.
8) pending at mandal level -  ఇలా ఉన్నవారి పట్టాదారు పాసు పుస్తకము ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో అందజేయగలరు.
పైన తెలిపిన వాటిలో ఏ కారణంవలనైన సందేహం ఉన్న రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం లో అర్జీ రూపం లో (బాంక్ పాస్ పుస్తకం,ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్) ఇవ్వగలరు.

Previous
Next Post »
0 Komentar

Google Tags