Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CM Jagan serious over name change of prathibha awards

CM Jagan serious over name change of prathibha awards

ప్రతిభా పురస్కారాలకు
అబ్దుల్‌ కలాం గారి పేరు యధాతధం
పదోతరగతి ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే అబ్దుల్‌ కలాం పురస్కారాల పేరు మార్పుపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రంగా స్పందించారు. తనకు తెలియకుండా ప్రతిభా పురస్కారాల పేరు మార్చారని ఆగ్రహం వెలిబుచ్చారు. పురస్కరాలను యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరిటే అందించాలని ఆదేశించారు. అబ్దుల్‌ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్‌ఆర్‌ పేరిట అందించనున్నట్లు 4 వ తేది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.    సదరు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అధికారులనుఆదేశించారు. కలాంతోపాటు గాంధీ, అంబేడ్కర్‌, పూలే, జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని సూచించారు.

 ఇదిలా ఉండగా ప్రతిభా పురస్కారాలను ఇక నుంచి ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికే అందించనున్నారు. ప్రభుత్వం సోమవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అబ్దుల్ కలాం జయంతి నాడు నవంబర్ 11న వీటిని విద్యార్థులకు ప్రధానం చేస్తారు. ప్రభుత్వ స్కూల్లో చదువుతూ ప్రతిభ కనబరిచిన వారికి వీటిని అందించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో ప్రభుత్వ స్కూల్లో తో పాటు ప్రైవేటు స్కూల్లో చదివే వారికి సైతం ఈ అవార్డులు ఇచ్చే వారు.
School Education Department – Scheme for promoting  Quality and Excellence in Education – Re-designation of “Dr. A.P.J. Abdul Kalam Pratibha Puraskar Awards” as “Dr. A.P.J. Abdul Kalam Vidya Puraskar Awards” for  distribution of awards from 2019 onwards on the occasion of birth anniversary of “Maulana Abul Kalam Azaad” as National  Education Day – Revised– Orders – Issued.

Previous
Next Post »
0 Komentar

Google Tags