Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

School assembly 10th December Information

School assembly 10th December Information


నేటి ప్రాముఖ్యత
ప్రతి సంవత్సరం డిసెంబరు 10వ తేదీన మానవ హక్కుల దినోత్సవం (Human Rights Day) జరుపుకుంటాము. [ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించినవారికి ఇచ్చే పురస్కారం, అలేగా అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్నవారిని ఈరోజున సత్కరిస్తారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మానవ హక్కుల రంగంలో చురుగ్గా పనిచేస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నాయి. సాధారణ, సాంఘిక సమస్యలను చర్చిస్తాయి.]
చరిత్రలో ఈ రోజు
భారత దేశ ప్రథమ ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10నాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు పునాది రాయి పడింది. భారత దేశ రెండవ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధి చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.
నేటి అంశము - తెలుగు
ఏ ఎండకా గొడుగు పట్టు - సమేత దాని పుట్టుక
రేపటి ఎండ, మాపాటి  ఎండమధ్యాహ్నపు ఎండ, నీరెండ అని ఎండ పలురకాలు. ఎండ ననుసరించి గొడుగు దిశను గొడుగును మార్చుకుంటూ ఉండే వారిని గూర్చి ప్రారంభమైన ఈ సామెత పరిస్థితులను అనుసరించి స్వభావం లేదా శీలం మార్చుకునే అవకాశవాదులను, వ్యక్తిత్వం లేని వారిని గూర్చి తెలియజేయటానికి వాడబడుతుంది.
తెలుగు సంఖ్యా వాచక పదము
పంచ విధ లోహములు - 1. బంగారము 2. వెండి 3. రాగి 4. కంచు 5. ఇనుము
తెలుగు వారి వావి వరుసలు
ఆడపడుచు : ఒక తండ్రికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. అతను తన కుమారునికి వివాహం చేశాడు. కుమారుని భార్య తన కుమార్తెకు ఆడపడుచు లేదా ఆడబిడ్డ అవుతుంది.
నేటి ఆణిముత్యం
ముసలితనమున మాత్రమే మ్రోల జేరి
దేవదేవుని తలచెడి దీక్ష బూని
నడుచుకొనవాడ, నీ నీడ నమ్ము మనెడి
నరుడు జీవన యాత్ర కనర్హుడగును
భావము:
ముసలితనంలో మాత్రమే దేవుడా నిన్నే నమ్ముతున్నాను నీనీడన నడుస్తాను అనేవాడు జీవించటం వ్యర్ధం.
మంచి మాట
ఉన్నత వ్యక్తిత్వం ఉంటే, శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటాడు - ఐన్‌స్టీన్‌
నేటి జీ.కె
ప్రశ్న: ప్రపంచంలో పెద్ద మంచినీటి స‌ర‌స్సు ఏది?
జ: సుపీరియ‌ర్

వార్తలలోని ముఖ్యాంశాలు
*పొరుగునున్న మూడు దేశాల్లో మతపరమైన గురై శరణార్ధులుగా మనదేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించాలన్న కీలక బిల్లుకు లోక్ సభ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆమోదం తెలిపింది.
*ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ నిలిచారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో టుంజీని విజేతగా ప్రకటించారు.
*నేడు ప్రపంచాన్ని పీడిస్తున్న వాతావరణ మార్పులు పోషకాహారలోపం నేటి ప్రపంచానికి పెను సవాల్ అని విశ్లేషిస్తున్నారు బిల్ గేట్స్ నూతన ఆవిష్కరణల తోనే ఈ రంగంలో గణనీయమైన మార్పులు దేవుడంటూ
*కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 12 సీట్లను కమలం పార్టీ గెలుచుకుంది
*మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే తే మరణశిక్ష పడుతుందనే భయం రావాలని అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
*వ్యవస్థీకృత డోపింగ్ కారణంగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది.  ఈ చర్యలతో రష్యా క్రీడ సమాజం తీవ్రంగా నష్టపోనున్నది.
*దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల్లో ట్రిపుల్ సెంచరీని సమీపించింది. సోమవారం ఒక్కరోజే మన అథ్లెట్లు 27 స్వర్ణాలు సహా 42 పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ఈ పోటీల్లో భారత్ 294 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
School Assembly,prayer songs,Assembly information,historical events,information of the day,news of the day,golden words,today golden words,moral sentences,today's importance,headlines in the news,december month school assembly day wise,december 2019 school assembly,december 2019 school assembly information,today's topic, నేటి ప్రాముఖ్యత,చరిత్రలో ఈ రోజు,నేటి అంశము,మంచి మాట / పద్యం,వార్తలలోని ముఖ్యాంశాలు,10th december 2019 assembly, 10th december 2019 assembly,news of the day history, news of the day highlights, 10th dec 2019 assembly,dec 10th assembly, dec 10th historical events,10th december 2019 assembly,december 10th assembly, december 10th historical events,school related today assembly, school related today news, school related december 10th information, school related december month information
Previous
Next Post »
0 Komentar

Google Tags