Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

6th January School assembly information

6th January School assembly information


చరిత్రలో ఈ రోజు
*1929 సం.లో మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు మరియు రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
*1947 సం.లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
*భారత కర్ణాటక సంగీత విద్వాంసుడు  “బాలసుబ్రహ్మణ్యం” 1910సం.లో జన్మించారు.
*ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత “జి. మునిరత్నం నాయుడు” 1936 సం.లో జన్మించారు.
*క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్ “కపిల్ దేవ్” 1959 సం.లో జన్మించారు.
*ప్రముఖ సంగీత దర్శకులు “ఎ.ఆర్.రెహమాన్” 1966 సం.లో జన్మించారు.
*ప్రసిద్ధ వాగ్గేయకారుడు  “త్యాగయ్య” 1847 సం.లో మరణించారు.
*ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త “లూయీ బ్రెయిలీ” 1852 సం.లో మరణించారు.
*జన్యు శాస్త్రములో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త “గ్రెగర్ మెండల్”  1884 సం.లో మరణించారు.
*ప్రముఖ భారతీయ చలనచిత్ర నటుడు  “ఓం పురి” 2017సం.లో మరణించారు.

మంచి మాట
"మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది, అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటలకంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి"
మంచి పద్యం
ఎప్పుడు పుట్టెనోకదా
మానవ నాగరికత
మార్పు రాకపోతే
లేదు మనకు సార్ధకత
ఓహో ! భారత ధరిత్రీ
ధన్యులను కన్న చరిత్రి
నేటి జీ.కె
ప్రశ్న: మద్యం తాగేవారిని గుర్తించే కిరణాలు ఏవి?
జ: పరారుణ కిరణాలు


నేటి వార్తలలోని ముఖ్యాంశాలు
> జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా మొత్తం 11,61,244 మంది పేద విద్యార్థులకు ప్రభుత్వం వసతి దీవెన కార్డులు అందజేయనున్నది. ఇంటర్, ఆపైన చదువుతూ.. స్కాలర్‌షిప్‌లు తీసుకునే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం సంవత్సరానికి రూ. 20 వేలు అందజేస్తుంది.
> తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
> రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలోనే ప్రైవేటు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్‌ ఉన్న చర్లపల్లిశ్రీకాకుళం, లింగంపల్లితిరుపతి, గుంటూరులింగంపల్లి, విజయవాడవిశాఖ, విశాఖతిరుపతి రూట్లలో అనుమతించనున్నారు.
> తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 13 నగరపాలక సంస్థల్లో ఎస్టీ-1, ఎస్సీ-1, బీసీ-4, జనరల్‌-7 స్థానాలను కేటాయించగా, 123 పురపాలికల చైర్మన్లలో ఎస్టీ-4, ఎస్సీ-17, బీసీ-40, జనరల్‌ -62 స్థానాలను కేటాయించారు.
> సంపూర్ణ అక్షరాస్యత సాధన కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ కార్యక్రమానికి వయోజన విద్య విభాగం సిద్ధం అవుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 53.39 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నారు.
> దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వర్సిటీలోని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు.
> జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను ఈ నెల 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
> ప్రభుత్వం 2020 బడ్జెట్‌లో బ్యాంకులకు మూలధన నిధులను సమకూర్చే అవకాశం లేదు. ఈ  నేపథ్యంలో మొండిబకాయిల వసూలును ప్రోత్సహించే విధంగా, మార్కెట్ల నుంచి నిధులు సేకరించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించనుంది.
> అమెరికా డ్రోన్‌ దాడిలో మృతి చెందిన జనరల్‌ ఖాసిం సులేమానీకి ఆదివారం ఇరాన్‌లో అభిమానులు భారీగా తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. అమెరికాకు ఇక చావేఅని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. >ఇరాన్‌ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ హెచ్చరించారు.
> బర్సపర స్టేడియం వేదికగా టీమిండియా X శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది.
Previous
Next Post »
0 Komentar

Google Tags