Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Awareness on childrens bank account

Awareness on childrens bank account

పిల్లల బ్యాంక్ ఖాతాపై అవగాహన
   పిల్లల కోసం సేవింగ్స్‌ ఖాతాను తెరవడం చాలా మంచిపనిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు, వాటి నిర్వహణ తీరు, నగదు చెల్లింపులు, డిపాజిట్‌, విత్‌డ్రా వంటి వివరాలు పిల్లలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పలు బ్యాంకులు పిల్లలకు అకౌంట్లు తెరిచే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఇలాంటి సేవింగ్‌ అకౌంట్స్‌ ద్వారా పిల్లలు మనీ సేవింగ్‌, మనీ ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), హెచ్‌డిఎఫ్‌ బ్యాంకు, ఐసిఐసిఐ వంటి పలు బ్యాంకులు మైనర్లకు పొదుపు ఖాతాలను అందిస్తున్నాయి. పిల్లల వయస్సు పదేళ్లు దాటిన తర్వాత వీరు అకౌంట్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. అలాగే ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. వీటిపై అవగాహన కల్పిస్తూనే సెక్యూరిటీ పాస్‌వర్డ్స్‌ వంటి విషయాలు వారికి తెలియకుండా జాగ్రత్తలు పాటించాలి.
వ్యక్తిగత ఫైనాన్స్‌ నైపుణ్యాల కోసం..
    బ్యాంకు డిపాజిట్‌, ఉపసంహరణ వంటి ప్రాథమిక బ్యాంకు అవసరాలు అర్థం చేసుకోవడానికి పిల్లలకు సేవింగ్స్‌ ఖాతాలు ఎంతగానో ఉపయోగపడతాయి. నెలవారీ స్టేట్‌మెంట్స్‌ ద్వారా ఖర్చులు, ఆదా, అవసరానికి ఎలా ఖర్చులు చేయాలి... వంటి విషయాలపై అవగాహన వస్తుంది. పిల్లలకు విభిన్నరీతుల్లో ఆధునిక బ్యాంకింగ్‌ను పరిచయం చేసేందుకు ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తిగత ఫైనాన్స్‌ సూక్ష్మ నైపుణ్యాలను నేర్పుతుంది.
పహ్లా కదమ్‌ అండ్‌ పహ్లీ ఉదాన్‌ ప్రయోజనాలు
   ఎస్‌బిఐ పహ్లా కదమ్‌ అండ్‌ పహ్లీ ఉదాన్‌ పేరుతో పిల్లలు లేదా మైనర్లు ఏ వయస్సులోని వారైనా ఈ సేవింగ్స్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. పేరెంట్స్‌ లేదా గార్డియన్స్‌ తో కలిసి పిల్లల పేరుపై జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ట్రాన్సాక్షన్స్‌ కోసం రోజుకు ఇన్ని అని పరిమితి ఉంది. పది చెక్కులు కలిగిన చెక్‌బుక్‌ ఇస్తారు. ఇది మైనర్‌ పేరిట గార్డియన్‌కు ఇస్తారు. ఏటీఎం కార్డు ఇస్తారు. పిఓఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) లిమిట్‌ రూ.5000. మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా రోజుకు ట్రాన్సాక్షన్‌ పరిమితి రూ.2,000. వీటితో పాటు ఆటో స్వైప్‌ సౌకర్యం కూడా ఉంది. రూ.20,000 పరిమితి ఉంది. రూ.1,000 చొప్పున రూ.10,000 వరకు స్వైపింగ్‌ సౌకర్యం ఉంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌
    హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కిడ్స్‌ అడ్వాంటేజ్‌ అకౌంట్‌ కావాలంటే 18 ఏళ్ల వయస్సులోని మైనర్‌ అయ్యి ఉండాలి. ఈ అకౌంట్‌ డెబిట్‌ కార్డుతో ఏటీఎం నుంచి రూ.2,500 వరకూ విత్‌ డ్రా చేసుకోవచ్చు. రూ.10,000 వరకూ ఖర్చు చేసుకోవచ్చు. ఈ అకౌంట్‌ పైన ఉచిత ఎడ్యుకేషన్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతుంది. పిల్లల కోసం ఇంటర్నేషనల్‌ డెబిట్‌ కార్డు, ఉచిత మంత్లీ ఎలక్ట్రానిక్‌ స్టేట్‌మెంట్స్‌, ఎస్సెమ్మెస్‌, ఈ-మెయిల్స్‌ ద్వారా ఇన్‌స్టాంట్‌ ట్రాన్సాక్షన్‌ అలర్ట్‌ ఉంటాయి. ఈ అకౌంట్‌కు మినిమం బ్యాలెన్స్‌ (యావరేజ్‌ మంత్లీ బ్యాలెన్స్‌) రూ.5000. ఫ్రీ పాస్‌ బుక్‌, ఫోన్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం కార్డు, మొబైల్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి.
ICICI బ్యాంకు యంగ్‌ స్టార్స్‌ సేవింగ్‌ అకౌంట్‌
     ఐసిఐసిఐ బ్యాంకు యంగ్‌ స్టార్స్‌ సేవింగ్‌ అకౌంట్‌ ద్వారా పిల్లలకు బ్యాంకింగ్‌ సేవలు అందిస్తోంది. పిల్లల కోసం అకౌంట్‌ ఓపెన్‌ చేసి, ఆపరేట్‌ చేయవచ్చు. డెబిట్‌ కార్డు ఇస్తారు. రోజుకు రూ.2,500 వరకూ షాపింగ్‌, రూ.5,000 వరకూ విత్‌ డ్రా చేసుకోవచ్చు. పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఓఎస్‌) మిషన్‌ ద్వారా నేరుగా పిల్లలు కొనుగోలు చేయవచ్చు. ఏదైనా ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. యాక్సిడెంటల్‌ ఇన్సురెన్స్‌, పర్చేస్‌ ప్రొటెక్షన్‌ కవర్‌ ఉన్నాయి. 18 ఏళ్ల వయస్సు వరకూ ఉన్న వారు ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. తల్లిదండ్రులు లేదా గార్డియన్‌ వారి తరఫున అకౌంట్‌ ఆపరేట్‌ చేయవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags