Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Army Day


 Indian Army Day
జనవరి 15 భారత సైనిక దినోత్సవం (ఆర్మీ డే) 

భారత సైనిక దినోత్సవం గురించి ....

1948 లో చిట్టచివరి బ్రిటిష్ కమాండర్ సర్ ఫ్రాన్సిస్ బచ్చర్ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్-ఇన్‌-చీప్ గా లెఫ్టినెంట్ జనరల్ కె.ఎం.కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) బాధ్యతలు స్వీకరించారు . అందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం " జనవరి 15 వ తేదీన " - " ఆర్మీ డే " ని నిర్వహిస్తారు . ఆ రోజున దేశ రాజధానిలో ఆరు ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయాల్లో పెరేడ్లు , ఇతర మిలటరీ షోలు నిర్వహిస్తారు.

మనదేశ ప్రజల పరిరక్షణకోసం తమ జీవితాలు త్యాగం చేసిన అమర సైనికులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు. భారతదేశ ప్రజాస్వామ్యం కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఎంతటి ముఖ్యమయిన పాత్రనయితే పోషించారో, భారత సైన్యము కూడా అంతే సమాన పాత్ర వహించినది . జనరల్ కోదండర మాదప్ప కరియప్ప స్వదేశీయులతోను, బ్రిటిషర్లతోనూ సత్సంబంధాలు కలిగివుండి జనరల్ రాయ్ బచ్చర్ నుంచి తొలికమాండర్ ఇన్‌-చీప్ గా బాధ్యతలు స్వీకరంచిన తర్వాత సైన్యము సరిహద్దుల్లోను, ప్రకృతి వైపరీత్యాలలోనూ అనేకవిధాల పోరాడింది . పోరాడుతూనే ఉంది .

భారతీయ సైన్యము చరిత్ర కొన్ని వేల సంవత్సరాలకు పైబడిందే. మహాభారత కాలాల్లో కురుక్షేత్ర సంగ్రామంలో దాదాపు నాలుగు లక్షల మంది యుద్ధంలో పాల్గొన్నారు. రధాలు , గురాలు , ఏనుగులపై నుంచి యుద్ధం సాగించడమే కాకుండా నేలపై నుంచి కూడా యుద్ధం చేసారు . అప్పట్లో విశ్వశాంతి , ధర్మ పరిరక్షణల కోసం అనేక యుద్దాలు జరిగాయి. క్రమ క్రమం గా నాగరికత పెరిగే కొద్దీ వాయవ్య దిశగా హిందూకుష్ పర్వతాల ద్వారా చొరబాట్లు పెరిగాయి . ఎన్నో శతాబ్దాల పాటు ఇక్కడ పర్యవేక్షణ లేదు . ఆ తరువాత చొరబాట్లకు అనేక మార్గాలు ఏర్పడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు గాను ఆయా ప్రదేశాల రాజ్యాధినేతలు యుద్ధాలు చేయాల్సివచ్చేది. స్వదేశీ తెగల్లోని సైన్యం ప్రధాన ఆయుధాలు విల్లు, బాణాలు. ఆనాటి యుద్ధ కారణాలు చాలా వరకు పరిమితంగా ఉండేవి. మనుగడ, చొరబాట్లకు సంబంధించినవే ఎక్కువ. భారతీయ రాజకీయ చరిత్రలో చెపుకోదగ్గ తొలి చొరబాటు క్రీ.పూ.327 లో అలెగ్జాండర్ అధ్వర్యం లో గ్రీకులది .

ప్రాచీన బారతీయ సాహిత్యంలో, రాజకీయాల్లో యుద్ధాల ప్రస్తావనలు ప్రముఖంగా కనిపిస్తాయి. చంద్రగుప్త మౌర్యులు కాలంలోని సైన్యాన్ని ఈ సందర్భముగా ప్రస్తావించుకోవాలి. ఆనాటి సైనిక చరిత్రకు 'అర్ధశాస్తం' ఓ ప్రముఖ దర్పణం లాంటిది. కళింగ రాజుల కాలంలో యుద్ధభూమిలోకి ఏనుగులు వచ్చాయి. ఇవి 17 వ శతాబ్ది దాకా సాగాయి. మౌర్యులు కాలంలో శాంతి స్థాపన జరిగినది. గుప్తుల కాలంలో మన దేశానికి ప్రపంచ గుర్తింపు లభించినది. ఈ విధంగా రాజ్యాల రక్షణ కోసం సైన్యము, సైనిక అవసరాలు, ఆయుధాలు పెరుగుతూ వచ్చాయి.

 బ్రిటిష్ ఆదిపత్యం పెరిగింది ... అనేక స్వాతంత్ర్య పోరాటాల అనంతరం బ్రిటిషర్ల నుంచి స్వేచ్చ పొందిన నేటి భారత సైన్యము పరిధి భాగా పెరిగినది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానము తో వ్యక్తిగత జీవితాలు పణంగా పెడుతూ దేశాన్ని అన్ని విధాలా కాపాడుతూ ఆపదల్లో ఆదుకునే బారత సైన్యానికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తో .. వారిని గౌరవిస్తూ దేశవ్యాప్తంగా  ఆర్మీ డే ను  గర్వంగా జరుపుకుందాం...

Previous
Next Post »
0 Komentar

Google Tags