Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Grama, ward Secretariat employees job chart

Grama, ward Secretariat employees job chart
గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగుల జాబ్‌ చార్ట్‌
గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరు కార్యాలయ పనివేళలకు ముందుగానే తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తమ పరిధిలో పర్యటించి ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలతో పాటు ఇతర సేవలన్నీ వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందించే లక్ష్యంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జాబ్‌ చార్ట్‌ లను కూడా రూపొందించింది.  
జాబ్‌ చార్ట్‌ ఇలా...
* క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య పనులుపారిశుధ్య కార్మికుల హాజరుపనితీరును పరిశీలించాలి.  
* మంచినీటి సరఫరావీధిలైట్ల పనితీరుస్పందనలో అందిన వినతులుఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.  
* క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలపై మధ్యాహ్నం నుంచి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.  
* ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ వివరాలతో పాటు వలంటీర్ల పనితీరు గురించి తెలుసుకోవాలి.  
* ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉద్యోగులు సచివాలయ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి.  
* ఉద్యోగులు రోజువారీ డైరీని నిర్వహించాలి.
* ఉద్యోగులంతా పంచాయతీ సమావేశాలుగ్రామ సభలకు హాజరవ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములు కావాలి.  
* నవరత్నాలతోపాటు ఇతర సేవలను ప్రజల ముంగిటకు సమర్థంగాసకాలంలో చేర్చడంపై గ్రామ సచివాలయం దృష్టి సారించాలి.  
నవరత్నాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.  
* ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అభ్యర్థనలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలి.  
* ప్రభుత్వగ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి.  
* 1956 కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.  
* తూనికలుకొలతల్లో అక్రమాలను నిరోధించడంబాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాల్య వివాహాల నివారణదశలవారీగా మద్యనిషేధంగృహ హింస చట్టం అమలుకు కృషి చేయాలి. 
వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపుపంపిణీపై సమీక్షించాలి.  
* లే అవుట్లుతాగునీటి కనెక్షన్లువ్యాపార లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను తనిఖీ చేయాలి.  
Previous
Next Post »
0 Komentar

Google Tags