Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Union Budget 2020 Highlights

Union Budget 2020 Highlights


కేంద్ర బడ్జెట్-2020 హైలెట్స్
>ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 150రైళ్లు.
>విద్యుత్‌ రంగానికి రూ.22వేల కోట్లు.
>రవాణా రంగానికి రూ.1.70లక్షల కోట్లు.
>ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.3.5లక్షల కోట్ల మూలధనసాయం.
>డిపాజిట్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు.
>కంపెనీ చట్టంలో మార్పులు. బ్యాంకింగేతర హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలకు అదనపు నిధుల కేటాయింపునకు కొత్త పథకం.
>ఆదాయపన్ను శ్లాబ్‌లు నాలుగు నుంచి ఏడుకు పెంపు.  
>రూ. 0 నుంచి  రూ.5 లక్షల వరకు ఎలాంటి ఆదాయపన్ను లేదు
>ఆదాయం రూ.5 నుంచి 7.5లక్షలు ఉన్నవారికి 10శాతం పన్ను. రూ 7.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ 15శాతం పన్ను. రూ.10లక్షల నుంచి 12.5లక్షల వరకూ 20శాతం పన్ను. రూ.15లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30శాతం పన్ను
Note: 5 లక్షల లోపు ఆదాయం కలిగి ఉంటే పన్ను ఉండదు కానీ, ఆదాయం 5 లక్షల రూపాయలు దాటితే 2.5 లక్షల నుండి 5 లక్షల వరకు పన్ను 5%  చెల్లించాల్సి ఉంటుంది.
>కొత్త స్లాబ్ లతో పన్ను చెల్లించేవారికి 80(c) రిబేటు వర్తించదు.
అంటే పిఎఫ్, ఇన్సూరెన్స్  తదితర పొదుపు మొత్తాలు, సిపిఎస్,  గృహ రుణాల పై ఇచ్చే రాయితీలు వదులుకున్నవారికి మాత్రమే ఈ రేట్లు మిగిలిన వారికి పాత రేట్లే.
కొత్త ఆదాయ పన్ను విధానం ఐచ్ఛికం అని తెలిపారు. మినహాయింపులు పొందాలా? వద్దా? అన్నది వేతన జీవుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. దీంతో పాత విధానంతో పాటు కొత్త విధానమూ అమల్లో ఉంటుంది. 
కొత్త ట్యాక్స్‌ విధానం ఎంచుకుంటే 80(సి) కింద వచ్చే రూ. 1,50,000/- మినహాయింపులు రావు
కొత్త విధానం స్లాబులు
1. రూ. 2.5 లక్షలలోపు ఆదాయమున్న వారికి పన్ను నుంచి మినహాయింపు 
2. రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఆదాయమున్న వారికి 5 శాతం పన్ను  
3. రూ. 5 నుంచి 7.5 లక్షల ఆదాయమున్నవారికి 10శాతం పన్ను .  
4. రూ. 7.5 నుంచి 10 లక్షల ఆదాయమున్న వారికి 15శాతం, 
5. రూ. 10 నుంచి 12 లక్షల ఆదాయమున్న వారికి 20 శాతం,  
6. రూ. 12.5 నుంచి రూ. 15 లక్షల ఆదాయమున్న వారికి 25 శాతం,  
7. రూ. 15 లక్షల కన్నా ఎక్కువ ఆదాయమున్నవారికి 30 శాతం
పాత విధానం స్లాబులు
Taxble Income ₹ 5 లక్షలు మించని వారికి మనము చెల్లించవలసిన టాక్స్ నుండి రూ. 12,500/- మినహాయింపు లభిస్తుంది. 
1) రూ. 2,50,000/- వరకు పన్ను లేదు 
2) రూ. 2,50,000/- నుండి రు 3,00,000/- వరుకు 5 శాతం 
3) రూ. 3,00,000/- నుండి రు 5,00,000/- వరకు రు 2,500+5 శాతం 
4) రూ. 5,00,000/- నుండి రు 10,00,000/- వరకు రు 12,500 +20 శాతం
5) రూ. 10,00,000/-లకు పైన రూ. 1,10,000+30 శాతం
>ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ వాటాల విక్రయం. స్టాక్‌మార్కెట్‌లో ఎల్‌ఐసీ  లిస్టింగ్‌
>జమ్మూకశ్మీర్‌ అభివృద్ధికి రూ.30,757కోట్లు.
>బ్యాంకు డిపాజిట్లపై బీమా రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంపు
>నగరాల్లో కాలుష్య నియంత్రణకు రూ.4,400కోట్లు
>ఎస్సీలు, ఓబీసీలకు రూ.85వేల కోట్లు కేటాయింపు, సీనియర్‌ సిటిజన్లు, దివ్యాంగులకు రూ.9,500కోట్లు.
>పౌష్టికాహార పథకం కోసం రూ.35,600కోట్లు. >మహిళలు, శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు రూ.28,600కోట్లు.
>నేషనల్‌ గ్యాస్‌ గ్రిడ్‌ను 16,300 కి.మీ. నుంచి 27వేల కి.మీ.లకు పెంచే దిశగా చర్యలు.
>లక్ష గ్రామాలకు ఓఎఫ్‌సీ ద్వారా డిజిటల్‌ కనెక్టివిటీ.
>అంగన్వాడీలు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు, పోలీస్‌స్టేషన్‌లకు డిజిటల్‌ అనుసంధానం.
>విద్యుత్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లు. >2024కు మరో 100 విమానాశ్రయాల అభివృద్ధి.
>ప్రతి గ్రామ పంచాయతీకి భారత్‌నెట్‌తో అనుసంధానం.
>చెన్నై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే. 2వేల కి.మీ. హైవేల నిర్మాణమే లక్ష్యం.
>బెంగళూరుకు రూ.18,600 కోట్లతో మెట్రో తరహా  సబర్బన్‌ రైల్వే వ్యవస్థ.
>రైలు మార్గాల ఇరు పక్కల సోలార్‌ కేంద్రాల ఏర్పాటు.
>పర్యాటక కేంద్రాలతో తేజస్‌ రైళ్లు.
>11వేల కిలోమీటర్ల మేర రైల్వే మార్గాల విద్యుదీకరణ.
>ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైలు. 
>ప్రధాన యూనివర్సిటీల్లో ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు
>రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్త 5 ఆకర్షణీయ నగరాలు.
>నైపుణ్య శిక్షణకు రూ.3వేల కోట్లు.
>యువ పారిశ్రామికవేత్తలకు అనేక ప్రోత్సాహకాలు.
>నేషనల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌కు రూ.1480కోట్లు. >జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకం.
>చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో బీమా పథకం.
>సెల్‌ఫోన్లు, సెమీ కండక్టర్లు, వైద్య పరికరాల ఉత్పత్తి ప్రోత్సాహానికి ఒక నూతన పథకం. ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా మారుస్తాం.
>త్వరలో కొత్త విద్యా విధానం. 
>విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం. 
నేషనల్‌ పోలీస్‌ వర్సిటీ, నేషనల్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీ ఏర్పాటు. 
>2026 నాటికి 150 యూనివర్సిటీల్లో కొత్త కోర్సులు. 
>జిల్లా ఆస్పత్రులతో మెడికల్‌ కాలేజీల అనుసంధానం. 
>విద్యా రంగానికి రూ.99,300కోట్లు.
>భారత్‌లో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు స్టడీ ఇన్‌ ఇండియా ప్రోగ్రాం ‘ఇండ్‌శాట్‌’
>బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట
>రూ 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు. >వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు. పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు. ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు. 
>స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు. 
>పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు
>ముద్ర స్కీమ్‌ ద్వారా గ్రామీణ మహిళలకు సాయం
>గ్రామీణ మహిళలకు ధాన్యలక్ష్మి పేరుతో నూతన స్కీం
>ఆన్‌లైన్‌లో ఆర్గానిక్‌ ఉత్పత్తులు
>16 లక్షలమంది రైతులకు గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ విద్యుత్‌
>సేంద్రియ సాగుచేసే రైతులకు మరిన్ని ప్రోత్సహకాలు
>మొదటి ప్రాధాన్యాంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి. ద్వితీయ ప్రాధాన్యాంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు. మూడో ప్రాధాన్యాశంగా విద్య, చిన్నారుల సంక్షేమం.
>2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడం ,రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు
>100 కరువు జిల్లాలకు తాగునీరు అందించే పథకాలు
>26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు
పేదరికం నుంచి 27 కోట్లమందిని బయటకు తెచ్చాం
>ఇక నుంచి ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌ మరింత సులభతరం చేస్తాం
>ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన
>జీఎస్టీతో పన్ను వ్యవస్థలోకి కొత్తగా 60 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు
>రూ లక్ష కోట‍్ల వరకూ జీఎస్టీ ప్రయోజనాలు సామాన్యులకు మళ్లింపు
>40 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి
>జీఎస్టీ శ్లాబుల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది
>జీఎస్టీ అమలు తర్వాత సామాన్యుల ఖర్చులు 4శాతం వరకు ఆదా అయ్యాయి


Previous
Next Post »
0 Komentar

Google Tags