Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

10th March School assembly information

10th March School assembly information
చరిత్రలో ఈ రోజు / మార్చి 10
* భారత కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ దినోత్సవం.
*1876 : టెలిఫోనును కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ దానిని మొదటిసారిగా ఉపయోగిస్తూ, పక్కగదిలోని వాట్సన్‌తో మాట్లాడాడు.
* 1896 : ప్రముఖ రంగస్థల నటుడు నిడుముక్కల సుబ్బారావు జననం (మ.1968).
*1913 : బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక ఆఫ్రో అమెరికన్ హారియట్ టబ్‌మన్ మరణం (జ.1820).
* 1928 : పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి స్వర్ణలత జననం (మ.1997).
* 1932 : ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త ఉడుపి రామచంద్రరావు జననం (మ.2017).
* 1985 : భారత్ పాకిస్తాన్‌ను ఓడించి ప్రపంచ క్రికెట్ చాంపియన్ ట్రోఫీ గెలిచింది.
* 1997 : పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి  స్వర్ణలత మరణం (జ.1928).
మంచి మాట
"నిజాయితీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు."
నేటి అంశము: మన సామెతలు
క్షణం తీరికలేదు దమ్మిడి ఆదాయం లేదు
కొంత మంది ఎప్పుడు చూసినా చాలా హడావుడిగా వుంటూ తీరికేలేనట్లే కనిపిస్తారు, కానీ వారు చేసేపని వల్ల కొంచెం కూడా ఉపయోగం ఉండదు. అటువంటి వాళ్ళను ఉద్దేసించి అనేదే ఈ సామెత.దీనిలో దమ్మిడీ అంటే అతి తక్కువ ధనం. పాతకాలంలో డబ్బును దమ్మిడీ, కానీ, అర్దణా, అణా ఇలా లెక్కపెట్టేవారు. ఎంత కష్టపడినా ఫలితం రానప్పుడు కూడా ఈ సామెతను ఉపయోగిస్తారు. ఇలాంటిదే మరో సామెత వున్నది: అరకాసు ఆదాయం లేదు అర గడి తీరుబడి లేదు. కాసు అనగా గతంలో చలామణిలో వున్న ఒక నాణెం.
మంచి పద్యం
అడిగిన జీతం బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుటకంటెన్
వడిగల యెద్దలఁగట్టుక
మడి దున్నుకబ్రతుకవచ్చు మహిలో సుమతీ!
తాత్పర్యం: ఓ సుమతీ! అడిగినపుడు జీతమును ఈయని గర్వియైన ప్రభువుని సేవించి జీవించుటకంటే, వేగముగా పోగల యెద్దులను నాగలికి కట్టుకొని పొలమును దున్నుకొని వ్యవసాయము చేసుకొని జీవించుట మంచిది అని భావం.
నేటి జీ.కె
ప్రశ్న: క‌ణ‌ములో కేంద్రక‌ము క‌ల‌ద‌ని తెలిపిన‌ది ఎవరు?
జ: రాబ‌ర్ట్ బ్రౌన్
నేటి వార్తలు
>ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
> ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నాడు-నేడు కింద పాఠశాలలకు అన్ని రకాల మౌలికవసుతల కల్పనకు కృషి చేస్తుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు వెల్లడించారు.
>హైదరాబాద్‌ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు.
>కొవిడ్‌ 19 కేసులు భారత్‌లో తాజాగా మరో రెండు కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 45కుచేరింది.
> సంక్షోభం దిశగా మధ్యప్రదేశ్‌ సర్కార్‌ పయనిస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు కనపడకుండా పోయి బెంగళూరులో ప్రత్యక్షమయ్యారు.
> ఒపెక్‌, రష్యా మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఫలితంగా బ్రెంట్‌ చమురు ధర బ్యారెల్‌కు 33 డాలర్లకు తగ్గింది.
>చమురు, యెస్‌బ్యాంక్‌, కరోనా ప్రభావంతో మార్కెట్లు సంక్షోభం లో కూరుకుపోయాయి.
> సుడాన్‌ ప్రధాని అబ్దల్లా హమ్దోక్‌ ఉగ్రవాదుల బాంబుదాడిలో త్రుటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు.
>ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19(కరోనా వైరస్‌) జన్యు పునఃసంయోగాల(జీన్‌ రీకాంబినేషన్‌) వల్లే పుట్టిందని చైనీయుల ఆధ్వర్యంలోని పరిశోధకుల సమూహం తాజాగా వెల్లడించింది.

>ఖేలో ఇండియాలో భాగంగా జరిగిన ఏక్‌ భారత్‌శ్రేష్ట్‌ భారత్‌ జాతీయ టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల తెలంగాణ జట్టు చాంపియన్‌గా నిలిచింది.
Today's news 10-3-2020

1.University of Hyderabad’s ASPIRE-BioNEST ranked 6th in India
2. UNO said  COVID-19 crisis could cost world up to $2 trillion:
3.Hyderabad Airport  stood as the  best in environment,  in Asia-Pacific region.
4.ED arrested Yes Bank founder Rana Kapoor under Money Laundering Act
5.Hazrath Ali birthday was celebrated with gaiety in Hyderabad 
6.  Etela  said  Every air passenger will be screened:
7.Harish Rao said loans under 25000 to the farmers to be given by the March-end
8.PM advised to adopt NAMASTE instead of handshakes.
9.Maharaja Ranjit Singh named 'Greatest Leader of All Time' in BBC poll
10Australia  bagged the women's T20 world cup
Don't trust words but trust actions
Q: Who's the captain of Women's T20 Indian Team?
A: Harmanpreet Kaur
Previous
Next Post »
0 Komentar

Google Tags