Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Qualifications and disqualifications of the candidates who are contesting for the Sarpanch

Know the qualifications and disqualifications of the candidates who are contesting for the Sarpanch

సర్పంచ్‌ పదవికి అర్హతలు.. అనర్హతలు
HANDBOOK FOR CONTESTING CANDIDATES (TELUGU)
పంచాయతీ ఎన్నికలకు నగరా మోగింది. ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు అనుకూలంగా మారిన చోట ఆశావహులు సన్నద్ధమవుతున్నారు.  సర్పంచ్‌ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు, వార్డు అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు తెలుసుకుందాం

పరిశీలన నాటికి అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి.
పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పని సరిగా ఓటరుగా నమోదై ఉండాలి.
ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికలలో పోటీచేయడానికి వీలు లేదు.
ఒక వేళ ఆ వ్యక్తికి 31-5-1995 కంటే ముందే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్నట్లయితే ఆమె, అతడు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హత కలిగి ఉంటారు.
01.06.1995 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉంటే ఆ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు.
 ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఉత్తర్వులు డబ్ల్యూపీ నంబర్‌ 17947/2005లో తేది 19-7-2006 తీర్పు ప్రకారం దత్తత ఇచ్చిన పిల్లలు స్వంత తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగానే పరిగణిస్తారు. వారిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు చెందిన పిల్లలుగా పరిగణించరు. ఒక వ్యక్తి ముగ్గురు పిల్లలు ఉంటే వారిలో ఒకరిని దత్తత ఇచ్చినా అనర్హుడిగానే పరిగణిస్తారు.
ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలు కలిగి ఉండి భార్య చనిపోయిన తరువాత రెండో భార్య ద్వారా ఇంకో సంతానాన్ని పొందితే అతనికి ముగ్గురు సంతానంగా పరిగణిస్తారు. అతని రెండో భార్య ఒక్క సంతానం కలిగి ఉన్నందున ఆమె పోటీ చేయడానికి అర్హురాలు.
ముగ్గురు పిల్లలు ఉన్న వ్యక్తికి నామినేషన్‌ పరిశీలనకు  ముందు ఒకరు చనిపోతే ప్రస్తుతం ఉన్న పిల్లలను లెక్కలోకి తీసుకుని అతని అర్హతలను నిర్ణయిస్తారు.
ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత భార్య గర్భవతి అయినా పోటీకి అనర్హులు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు. ఆంధ్రప్రదేశ్  పంచాయతీ రాజ్‌ చట్టం 1994  ప్రకారం నామినేషన్‌ పరిశీలన తేది నాటికి పోటీచేస్తున్న వారు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అది ఆమోదించిన తరువాత మాత్రమే పోటీకి అర్హులుగా పరిగణించి నామినేషన్‌పరిశీలన చేస్తారు.
రేషన్‌ దుకాణం డీలర్‌ ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హులు. ఉమ్మడి హైకోర్టు డబ్ల్యూపీ నంబర్‌ 14189/2006లో సోమ్‌నాథ్‌ వి విక్రం, కె అరుణ్‌కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకుని రేషన్‌ షాప్‌ డీలర్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అని తీర్పు చెప్పింది.
అంగన్‌వాడీ వర్కర్లు ఎన్నికల్లో పోటీచేయడానికి అర్హులు కారు.
నీటి వినియోగదారుల సంఘం సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు.
సహకార సంఘాల సభ్యులు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. సహకార సంఘాల చట్టం 1954 కింద సహకార సంస్థలు రిజిష్టర్‌ అవుతాయి.వారు ప్రత్యేక శాసనసభ ద్వారా చేసిన చట్టం ద్వారా నియమించలేదు  కాబట్టి వారికి అవకాశం ఉంది.
స్వచ్ఛంద, మత సంబంధ సంస్థల చైర్మన్లు, సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. 1987 హిందూ మత సంస్థల చట్టం, దేవాదాయ శాఖ సెక్షన్‌ ప్రకారం సంస్థలు ఏర్పాటయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పని చేయువారు కూడా అనర్హులు
అభ్యర్థికి ప్రతిపాదకుడుగా ఉన్న వ్యక్తి అదే వార్డు, ప్రాదేశిక నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు.
అభ్యర్థి తప్పడు సమాచారం ఇచ్చినప్పటికి నామినేషన్‌ తిరస్కరించరు.
అభ్యర్థిపై ఇతరులు ఫిర్యాదు చేస్తే దానికి రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థి ఇచ్చిన నామినేషన్‌ పత్రాలలో ఇచ్చిన సమాచారం తప్పు అని భావించినట్లయితే ఐపీసీ సెక్షన్‌ 177, క్రిమినల్‌ పోసీసర్‌ కోడ్‌ 195 ప్రకారం అదే ప్రాంతానికి చెందిన న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలి. కానీ నామినేషన్‌ తిరస్కరించవద్దు.
మతిస్థిమితం లేని వ్యక్తి పోటీకి అనర్హుడు.
నామినేషన్‌ వేస్తున్న వ్యక్తి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు అదేరోజు ఇవ్వకపోయినా నామినేషన్‌ తీసుకుంటారు.
చెక్‌లిస్టులో ఎలాంటి పత్రాలు సమర్పించలేదని నమోదు చేయాలి. ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లు నామినేషన్ల చివరి తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలి. ఆ తర్వాత ఇచ్చినా స్వీకరించరు. నామినేషన్‌ తిరస్కరణ అనేది పరిశీలనలో నిర్ణయిస్తారు.
పోటీ చేస్తున్న అభ్యర్థికి ప్రతిపాదకుడు నామినేషన్‌ పత్రాలపై సంతకం పెట్టకుంటే అఫిడవిట్‌ సమర్పించాలి. కానీ దానికి రిటర్నింగ్‌ అధికారి తనంతటతాను సంతృప్తి పొందాలి.
ప్రతిపాదనకుడి సంతకం ఫోర్జరీ అని తేలితో దానికి రిటర్నింగ్‌ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి విచారణ తర్వాత నిర్ధారించి ఆ నామినేషన్‌ తిరస్కరించవచ్చు.
ఒక వ్యక్తి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గరిష్టంగా నాలుగు నామినేషన్లను వేయవచ్చు.
ఒక అభ్యర్థి ఎక్కువ నామినేషన్లను వేసినా చెల్లుబాటు జాబితాలో అతని పేరు ఒక్కసారి మాత్రమే రాస్తారు
అభ్యర్థి తన నామినేషన్‌ ఉపసంహరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు నిరీక్షించి ఉపసంహరించుకోవాలి.
నామినేషన్‌ వేయడానికి అభ్యర్థి, ప్రతిపాదకుడితోపాటు మరో ముగ్గురిని రిటర్నింగ్‌ అధికారి తన గదిలోకి అనుమతి ఇస్తారు.
నామినేషన్‌లో అభ్యర్థి సంతకం మర్చిపోతే దానిని తిరస్కరించవచ్చు. ఒక్కసారి నామినేషన్‌ వేసిన తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం లేదు.
అభ్యర్థి నామినేషన్‌ ఉపంసహరణ నోటీసుపై స్వయంగా సంతకం చేసి నమూనాలో సమయంలోపు రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలి. అభ్యర్థి ఇవ్వలేని సమయంలో రాతపూర్వకంగా అధికారం ఉన్న ప్రతిపాదకుడు ఎన్నికల ఏజెంట్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి సమర్పించవచ్చు.
అభ్యర్థి ఒక్కసారి నామినేషన్‌ ఉపంసహరణ తర్వాత దానిని రద్దు చేసుకోవడానికి వీలు లేదు.
రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ తిరస్కరిస్తే దానికి  పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం మరుసటిరోజు సబ్‌ కలెక్టర్‌, ఆర్డీవోకు అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్‌ చేయవచ్చు.
ఒక వ్యక్తి ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాల్లో, వార్డుల్లో పోటీ చేయకూడదని  పంచాయతీరాజ్‌ చట్టంలో ఎక్కడా లేదు.
ఓటు హక్కు ఒక్కసారి మాత్రమే వినియోగించుకోవాలి.
పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు.
శిక్ష అనుభవించకుండా బెయిల్‌పై ఉంటే అనర్హత నుంచి బయటపడినట్లు భావించారు. ఇలా అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.
డిపాజిట్ల వివరాలు
వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్‌ రుసుం కింద 250,
ఇతరులు 500 రూపాయలు చెల్లించాలి.
సర్పంచ్‌ పదవికి పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు వెయ్యి రూపాయలు, ఇతరులు 2 వేల రూపాయలు చెల్లించాలి.
Previous
Next Post »
0 Komentar

Google Tags