Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet special meeting highlights

AP Cabinet special meeting highlights

ఏపీ కేబినెట్‌ ప్రత్యేక సమావేశం ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కేబినెట్‌ ప్రత్యేకంగా సమావేశం జరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున్న ఈ ప్రత్యేక కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌పై  ఆర్డినెన్స్‌ ను ఆమోదించారు. ఈ భేటీలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా కట్టడికి మరిన్ని నిర్ణయాలు, ప్రజలకు అందించే సేవలపై చర్చించారు. అందుకోసం కేబినెట్‌ హాల్‌లో కాకుండా కాన్ఫరెన్స్‌ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు అందులోని ముఖ్యాంశాలు ...
*బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ కు ఏపీ కేబినెట్‌ ఆమోదం
*వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్‌ ఆర్డినెన్స్‌ కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
*ప్రతి జిల్లా కలెక్టర్‌ వద్ద రూ.2కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు.
*రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.  
*దాదాపు 28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు.
*104 హెల్ప్‌లైన్‌ నెంబరు ఏర్పాటు చేశాం... 24గంటలు పనిచేస్తుంది.
*కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశాం.
*జిల్లా స్థాయిలో 200 పడకల ఆసుపత్రిని సిద్దంగా ఉంచాం. కరోనా వ్యాపించకుండా స్వీయనింత్రణ విధించుకున్నాం.
*విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరులోని ఆసుపత్రుల్లో కరోనా వైరస్‌ రోగులకు చికిత్స అందిస్తున్నాం.
*52వేల ఎన్‌-95 మాస్క్‌ లు, 4వేల పీపీఈలు, 400 వెంటిలేటర్లు, 10లక్షల సర్జికల్‌ మాస్క్‌ లు అందుబాటులో ఉన్నాయి’’ అని మంత్రి వివరించారు.
*ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు.
*కరోనా నియంత్రణకు ప్రతి జిల్లా, నియోజకవర్గాల వారీగా టాస్క్‌ ఫోర్స్‌ లు ఏర్పాటు
*ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి ప్రభుత్వ నిస్సహాయతను అర్థంచేసుకొవాలని మంత్రి పేర్ని నాని కోరారు.
*ఎట్టి పరిస్థితుల్లోనైనా రావాలనుకుంటే మాత్రం 14 రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడితే రాష్ట్రంలోకి అనుమతిస్తామని స్పష్టంచేశారు.
*పొరుగు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీలతో సీఎం జగన్‌, ఇతర ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రానీయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

Previous
Next Post »
0 Komentar

Google Tags