Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bridge course: Levels- subject-expected learning outcomes-teaching process


Bridge course: Levels- subject-expected learning outcomes-teaching process
వారధి: వివిధ స్థాయిలు- సబ్జెక్టు-ఆశించిన అభ్యసన ఫలితాలు
1st LEVEL:-
తెలుగు: వర్ణమాలలో అక్షరాలను గుర్తించడం, మూడక్షరాల పదాలను గుర్తించడం. తప్పులు లేకుండా చదవడం, రాయడం, సరళమైన వాక్యాల లేఖనం.
గణితం: 1 నుంచి 100 సంఖ్యలు, 1 నుంచి 10 అంకెలను పదాలగా రాయడం.
ఆంగ్లం: ఆంగ్ల వర్ణమాల, రెండు నుంచి నాలుగు అక్షరాల పదాలను గుర్తించడం, తప్పులు లేకుండా చదవడం, రాయడం.
2nd LEVEL:-
తెలుగు: సరళమైన వాక్యాలు చదవడం, రాయడం, అర్థవంతంగా చదవడం, సాధారణ వాక్యాలను మాట్లాడటం.
గణితం: 1 నుంచి 100 సంఖ్యలను పదాలుగా  రాయడం, రెండంకెలతో సంకలనం, గుణకారం భాగహారం గణిత పదజాలంపై అవగహన.
ఆంగ్లం: సరళమైన వాక్యాలు చదవడం, రాయడం, అర్థవంతంగా చదవడం, సాధారణ వాక్యాల్లో మాట్లాడటం.
బోధన ప్రక్రియ ఇలా...
*1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని గేయాలను నేర్పించాలి.
*పెద్ద అక్షరాల్లో రాసిన అభినయ గీతాల చార్టులను ప్రదర్శించడం.
*అభినయ గేయం గురించి విద్యార్థులతో సంభాషించడం.
*ఉపాధ్యాయుడు మూడు సార్లు పాడి వినిపించడం.
*ఒక్కో వాక్యం పాడుతూ బాలలతో పాడించడం.
*విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాడటం.
*విద్యార్థులు సొంతంగా పాడటం.
*అభినయిస్తూ ఉపాధ్యాయుడు ఒక్కో వాక్యం పాడటం.
*గేయాల్లోని కీలక పదాలను గుర్తించడం.
*అభినయ గేయంలోని ప్రాధాన్య విషయాన్ని విద్యార్థులతో చర్చిండం ద్వారా భావాలు, అందులోని పాత్రలు, వాటి స్వభావంపై అవగహన కల్పించడం.
*విద్యార్థులు అభినయిస్తూ గేయం మొత్తాన్ని పాడటం.
Previous
Next Post »
0 Komentar

Google Tags