Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

COVID-19 Lancet general report / Corona effect is like this .

COVID-19 Lancet general report / Corona effect is like this ..

లాన్సెట్‌ నివేదిక / కరోనా ప్రభావం చూపించేది ఇలా...
కరోనా మన శరీరంపై ఎలా ప్రభావం చూపిస్తుందో ప్రముఖ జర్నల్‌ లాన్సెట్‌ తాజా సంచికలో ఒక నివేదిక ప్రచురించింది. ఆ నివేదిక ప్రకారం ఈ వైరస్‌ సోకిన అయిదు రోజుల వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఆ తర్వాత జ్వరం, గొంతు నొప్పి, జలుబుతో ప్రభావం మొదలవుతుంది.. ఒక్కోసారి లక్షణాలు బయటపడడానికి 14 రోజులు కూడా పడుతుంది. కరోనా వైరస్‌ శరీరంపై ప్రభావం చూపించడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి ఏయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ..
13 రోజులు
* మొదటి రోజే కొద్దిగా జ్వరం వస్తుంది.
* మొదట్లో ముక్కు, గొంతు ద్వారా శ్వాసకోశ సమస్యల లక్షణాలు కనిపిస్తాయి.
* మూడో రోజు నుంచి దగ్గు, గొంతు నొప్పి ప్రారంభంఅవుతాయి.
* కరోనా బాధితుల్లో లక్షణాలు ఇలా మొదలైన వారు: 80%
49 రోజులు
* వ్యాధికారక వైరస్‌ 3-4 రోజుల్లో ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది
* 4-9 రోజులకు శ్వాస తీసుకోవడానికి కష్టమవుతుంది
* 8-15 రోజుల వ్యవధిలో ఊపిరితిత్తులు వాచి తీవ్ర శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశముంది
* శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నవారు : 14%
815 రోజులు
*ఊపిరితిత్తుల నుంచి ఇన్‌ఫెక్షన్‌ రక్తంలోకి చేరుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి.
* వారం ముగిసేసరికి... విషతుల్యమై ప్రాణహాని స్థాయికి చేరుతుంది
* అప్పట్నుంచి రెండు వారాల పాటు బాధితుల్ని కాపాడుకోవడానికి అత్యంత జాగరూకత అవసరం.
* ICU లో ఉంచి వారికి చికిత్స అందించాలి.
* బాధితుల్లో ఈ పరిస్థితి వచ్చిన వారు : 5%
3 వారాల తర్వాత
* రోగనిరోధక శక్తి అధికంగా ఉండి మరే ఇతర జబ్బులు లేని వారు కరోనాను జయించడం సులభమే. హైపర్‌ టెన్షన్, షుగర్, గుండె జబ్బులు ఉన్నవారు, 60 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధితో ఎక్కువ ముప్పు.
* కరోనా మృతుల శాతం : 3 నుంచి 4 శాతం
Previous
Next Post »
0 Komentar

Google Tags