Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Employee Service Rules: Last Pay Certificate


ఉద్యోగుల సేవా నిబంధనలు (Employee Service Rules)
లాస్ట్ పే సర్టిఫికేట్ (Last Pay Certificate) జారీ నిబంధనలు:
 లాస్ట్ పే సర్టిఫికేట్  కు సంబంధించిన నిబంధనలు సాధారణంగా కంట్రోలర్ & ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ వాల్యుమ్-2,అనుబంధం 18 ప్రకారం LPC జారీచేయాలి. ఉద్యోగికి LPC జారీచేసిన తరువాత సంబంధించిన ఎలాంటి క్లైములు డ్రాయింగ్ అధికారి చేయరాదు. ఉద్యోగి నెల మధ్యలో బదిలీ అయితే పాత కార్యాలయంలోనే ఆ నెలకు సంబంధించిన పూర్తిజీతాన్ని సంబంధిత హెడ్ ఆఫ్ అకౌంట్లలో డ్రా చేసి ఇవ్వాలి.
* LPC లో ఉద్యోగికి సంబంధించిన స్టాండర్డ్ మినహాయింపులు (Deductions) రికవరీ వివరాలు పొందుపర్చాలి. కొత్త కార్యాలయంలో ఉద్యోగి నుండి రికవరీ చేయవలసిన లోన్ లు,అడ్వాన్సులు ఎంత వరకు రాబట్టుకున్నది ఇంకా ఎన్ని కిస్తులు రికవరీ చేయవలసి ఉన్నది అను వివరాలు LPC లో పొందుపర్చాలి- APF Volume-1 లోని ఆర్టికల్ 239(c)(2)
* ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు బ్యాంకుల ద్వారా చెల్లిస్తున్న కారణంగా LPC లో ఉద్యోగి గుర్తింపు సంఖ్యను(ID Number) పొందుపరచాలి - G.O.Ms.No.80 Fin Dt:19.3.2008 మరియు G.O.Ms.No.90 Fin Dt: 31.1.2002
* ఉద్యోగులు బదిలీ అయినపుడు సర్వసాధారణంగా LPC మరియు సర్వీసు రిజిస్టరు వెనువెంటనే పంపించాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో పరిపాలన జాప్యం వల్ల గాని,ఇతరత్రా కారణాల వల్లగాని ఉద్యోగి LPC సకాలంలో పంపనందు వల్ల ఉద్యోగి జీతభత్యాలు రాక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సందర్భాలలో LPC రాకపోయినప్పటికి 3 నెలల వరకు ఉద్యోగికి క్యాడర్ లోని స్కేలు కనిష్ట జీతం (Basic Pay) డ్రాయింగ్ అధికారి నియమ నిబంధనల మేరకు డ్రా చేసి చెల్లించవచ్చును. - G.O.Ms.No.454 F&P Dt: 06.12.1961

Previous
Next Post »
0 Komentar

Google Tags