Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Mercury, Saturn, Jupiter and Moon into one line

Mercury, Saturn, Jupiter and Moon into one line

ఒకే లైన్లోకి బుధుడు, శని, గురుడు, చంద్రుడు
         గురుడు, శని, బుధుడు, చంద్రుడు ఒకే లైన్ మీదకు రానున్నారు. ఏప్రిల్ 14, 15, 16తేదీల్లో ఈ అద్భుతాన్ని చూడొచ్చు. గురుడు, శని, బుధుడు ఉదయం కనిపించే గ్రహాలు వీటిని చూడటానికి ఇబ్బంది లేదు. సరిగ్గా ఏప్రిల్ నెల మధ్యలో ఇవి మూడు కలిసి చంద్రుడు ఉండే లైన్లోనే ఒక దాని వెనుక మరొకటి నిలుస్తాయి. ఇవి అమెరికాలో ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తాయని నాసా అంటుంది.
       ఒకవేళ చూడలేకపోతే ప్రత్యేకమైన యాప్ ల సహాయంతో రాత్రి ఆకాశంలో వాటిని కనుగొనవచ్చు. ఈ 3రోజులు మిస్సయితే మళ్లీ వీటిని 2022లోనే చూడగలం. ఇంతేకాకుండా ఈ రోజుల్లో  శుక్రుడు మిగిలిన నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా  కనిపిస్తాడు. దాంతో మనం చాలా సులువుగా గుర్తించవచ్చు
గ్రహాలను గుర్తించడం ఎలా.. ?
        రాత్రి వేళ ఎలాంటి మబ్బులు లేని ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తూ ఉంటాయి. వెలుగుతూ ఆరుతూ ఉన్న బల్బు మాదిరిగా గ్రహాలు వెలుగుతున్న బల్బు మాదిరిగా తీక్షణంగా కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. కనిపిస్తున్న గ్రహాన్ని నక్షత్రాన్ని మార్చి మార్చి చూసినప్పుడు మాత్రమే ఆ తేడా పరిశీలించవచ్చు.
ఎప్పుడు, ఎలా చూడవచ్చు.. ?
         ఏప్రిల్ 14,15,16,17,18,19 వరకు 5 గ్రహాలను వీక్షించవచ్చును. ఉదయం 4.30 గంటలకు తూర్పు దిక్కుగా నిలబడి ఆగ్నేయం గా తలఎత్తి చూడాలి. అప్పుడు ఆకాశంలో తూర్పు నుండి పడమరగా నిలువుగా మూడు గ్రహాలు దగ్గర దగ్గరగా ఉంటాయి. అందులో పెద్దగా వెలుగుతున్నది గురు గ్రహం మధ్యలో ఉన్నది శని గ్రహం, చివరిది అంగారక గ్రహం అలాగే 5 గంటల పైన ఉదయించే సూర్యుని మీదుగా బుధ గ్రహం కనిపిస్తుంది. ఈ సంవత్సరాంతము బుధగ్రహం మినహా మిగిలిన 3 గ్రహాలు రాత్రి వేళ కనిపిస్తూనే వుంటాయి. సాయంత్రం 7 గంటలపైన పడమరగా నిలబడి వాయవ్యంగా తలఎత్తి చూస్తే కాంతివంతమైన శుక్రగ్రహం కనిపిస్తుంది.
         కాలుష్యం లేని సమయం కాబట్టి.. మన ఇంటి బాల్కనీలో నుంచి లేదా టెర్రస్ మీద నుంచి బైనాక్యులర్స్ తో చూడొచ్చు. నక్షత్రాలను రోజూ చూస్తున్నాం కానీ, గ్రహాలను కూడా ఇంటి దగ్గర్నుంచి చూడటం ఇదే మొదటిసారి కావొచ్చు ప్రజెంట్ జనరేషన్‌కు.

Previous
Next Post »
0 Komentar

Google Tags