Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Home delivery of petrol, CNG

ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్‌జీ: పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
పెట్రోల్, సీఎన్‌జీలను కూడా కస్టమర్ల ఆర్డర్‌పై వారి ఇంటికే తీసుకెళ్లి అందించే ప్రతిపాదన ఉన్నట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని పట్టణ ప్రాంతాల్లో 2018 సెప్టెంబర్‌ నుండి డీజిల్‌ను మొబైల్‌ వ్యాన్‌ ద్వారా ఐవోసీ డెలివరీ చేస్తోంది. అన్ని రకాల ఇంధనాలు.. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ ఒకే చోట లభించే విధంగా నూతన ఇంధన రిటైల్‌ నమూనాను తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి చెప్పారు. అయితే, పెట్రోల్, సీఎన్‌జీలకు మండే స్వభావం ఎక్కువ కనుక వీటి డోర్‌ డెలివరీలో మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
Previous
Next Post »
0 Komentar

Google Tags