Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Take these precautions to avoid sunstroke



ఎండల నుండి ఉపసమనానికి ఈ జాగ్రత్తలు తీసుకోండి
రానున్న కొన్ని రోజులు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదడంతోపాటు, వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రోహిణి కార్తెలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది. వృద్ధులు, పిల్లలు వేడివల్ల డీహైడ్రేషన్‌ బారినపడే ప్రమాదం ఎక్కువ.
ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
చేయదగినవి
> ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు ఎక్కువగా తీసుకోవాలి.
> తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
> డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి ORS పాకెట్లు దగ్గర ఉంచుకోవాలి.
> ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు త్రాగాలి.
> ఎండ వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే తల, మొహంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా టోపీ, తలపాగా లేదా గొడుగు వాడాలి.
>శరీరంలో నీరు, లవణాలు చెమట వేడివల్ల ఎక్కువగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నందున ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది.
> గది వాతావరణం కొంత చల్లగా ఉండేలా కిటికీలకు పట్టలు లాంటివి కట్టి నీరు చల్లడం చేయాలి.
> వడదెబ్బకు గురి అయినవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
> వడదెబ్బకు గురి అయినవారని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాను క్రింద ఉంచాలి.
> వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
> తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్నా వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చును.
చేయకూడనివి
> వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
> వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక అరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం అలస్యం చేయరాదు.
> మధ్యాహ్నం పూట  ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు.
> ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకొన కూడదు.
> శీతలపానీయములు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది.

Previous
Next Post »
0 Komentar

Google Tags