Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

What is the Styrene Gas

What is the Styrene Gas ?


విశాఖపట్నంలో సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ కంపెనీ నుంచి వెలువడిన విషవాయువుల కారణంగా చుట్టుపక్కల 5 కిలో మీటర్ల పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఫ్యాక్టరీ నుంచి లీకైన స్టైరీన్‌ గ్యాస్‌ బాగా ఘాటుగా ఉండటంతో కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఏమిటీ స్టైరీన్‌ గ్యాస్ ?
విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీనుంచి లీకైన గ్యాస్‌ను పీవీసీ గ్యాస్‌ లేక స్టైరీన్‌ గ్యాస్‌ అంటారు. సింథటిక్‌ రబ్బర్‌, ప్లాస్టిక్‌, డిస్పోసబుల్‌ కప్పులు, కంటైనర్లు, ఇన్సులేషన్‌..ఇలా పలు ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. స్టైరీన్‌ గ్యాస్‌కు రంగు వుండదు. తీయటి వాసన వుంటుంది. స్టైరీన్‌ కు మండే స్వభావం ఉంటుంది. మిగిలిన గ్యాస్ వాయువులతో పోలిస్తే ఇది చాలా బరువైన వాయువు.  ఇది తొందరగా గాలిలో కలిసిపోయే గుణం కలిగివుంటుంది. స్టైరీన్‌ గ్యాస్ వలన గాల్లో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఇది పీల్చిన వారికి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందక అవయవాలు దెబ్బతింటాయి. పీల్చిన గ్యాస్ పరిమాణాన్ని బట్టి ప్రభావం ఉంటుంది. 10 నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. అరగంట పీల్చితే మరణం సంభవించవచ్చు.
దీన్ని పీల్చిన 10నిమిషాల్లో కొందరు స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది. నిమిషాల్లో ఆక్సిజన్ అందకపోతే కొందరు శ్వాస ఆడక చనిపోతారు. ప్రమాదం జరిగిన చోట 0.5 కిలోమీటర్ల పరిధిలో గాలి చాలా ఘాటుగా ఉంటుంది.  ఈ గ్యాస్ వల్ల వికారం, తలనొప్పి వినికిడి సమస్య, నీరసం, కళ్ల మంటలు వస్తాయి. ఎక్కువగా పీలిస్తే నాడీ సంబంధిత వ్యాధులతో పాటు క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. కంటిచూపుపై ప్రభావం చూపిస్తుంది. తలనొప్పి, కడుపులో వికారానికి దారి తీస్తుంది. స్టిరీన్‌ గ్యాస్‌ పశు పక్ష్యాదులపై సైతం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గ్యాస్‌ లీకైన ప్రాంతంలో చెట్లు కూడా నల్లగా మారిపోతాయి. అయితే ఈ ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే ప్రమాదస్థలి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాలి. శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తితే సదరు వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags