Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Full details about YSR Cheyutha Scheme 2020 in Telugu

వైయస్ఆర్ చేయూత గురించి పూర్తి వివరాలు
వైయస్ఆర్ చేయూత ఎవరికి వస్తుంది?
వైయస్ఆర్ చేయూత ఎవరికి రాదు?
వైయస్ఆర్ చేయూత పొందుటకు అర్హతలు ఏంటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఆగస్టు 12 న వైఎస్సార్ చేయూత అనే కొత్త పథకం త్వరలోనే అమలు అవుతుంది. ఈ పథకం ద్వారా 75,000 రూపాయలు నాలుగు విడతలుగా వచ్చే నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. అయితే ప్రతి ఏటా 18,750 రూ చొప్పున జమ అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 24.19 లక్షల మంది మహిళలకు లబ్ధి నాలుగేళ్లలో మొత్తం 18.142 కోట్లు రూ ఖర్చు అవుతాయని అంచనా..
అర్హతలు ఇవీ
>మహిళలు వారి వయసు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వుండాలి SC, ST, BC & MINORITY కులం గల వారు మాత్రమే అర్హులు.
>వీరిలో వైఎస్సార్ పెన్షన్ తీసుకుంటున్న వారు అనర్హులు.
>ఆదాయం 10,000 లోపు ఉండాలి.
>భూమి మాగాణి 3.00 ఏకరాల లోపు మెట్ట 10.00 ఏకరాల లోపు ఉండాలి అదే విధంగా >మునిసిపాలిటీ ఏరియా లో ఆస్తి 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి.
>కరెంట్ 300 యూనిట్స్ లోపు వుండాలి.
>No Income Tax Payee, No Government Employee, No Four Wheeler
>తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రం ( Caste Certificate ) వుండాలి మరియు రాబడి ధృవీకరణ పత్రం ( Income Certificate ) మరియు బ్యాంక్ అకౌంటు కలిగి ఉండాలి.
అయితే ఈ పథకానికి అర్హులను గ్రామ వార్డు వాలంటీర్స్ ఈ నెల జూన్ 25 నుంచి జూలై 2 తేదీ వరకు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి గుర్తిస్తారు.
కాబట్టి ఎవరికైనా కుల ధృవీకరణ పత్రం ( Caste Certificate ) & రాబడి ధృవీకరణ పత్రం ( Income Certificate ) , బ్యాంక్ అకౌంటు లేకపోతే వెంటనే చేయించుకోండి.
ఈ పథకం షెడ్యూల్ ఇలా ఉంది
» జూన్ 25 - జూలై 2, 2020 ; వాలంటీర్స్ అర్హులను సర్వే చేసి గుర్తిస్తారు
» జులై 3 - జులై 9 2020 : సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు  జూలై ఎలిజిబిల్ లిస్ట్ & ఈనెలిజిబిల్ లిస్ట్ పైన
» జులై 10 - జులై 15 2020 : మండల స్థాయి లో MPDO & నగర పంచాయతీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ అర్హులు జాబితాను ఫైల్ చేస్తారు.
» జులై 16 - జూలై 20 2020 : జిల్లా స్థాయి లో ఎస్సీ ఎస్టీ మరియు బిసి మరియు మైనారిటీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు మరియు జిల్లా కలెక్టర్ అర్హుల జాబితా ను పరిశీలించి సిద్ధం చేస్తారు
» జులై 21 - జులై 23 2020 : జిల్లా కార్పొరేషన్ల నుండి సెర్ప్ ద్వారా అర్హుల జాబితా రావడం జరుగుతుంది
» జులై 24 - జులై 31 2020 : కార్పొరేషన్ వారీగా కావాల్సిన బడ్జెట్ లో వ్యయం చేస్తారు & అర్హుల బ్యాంక్ అకౌంట్ లు వాలిడేషన్ చేస్తారు
» ఆగస్టు 1 - ఆగస్టు 5 2020 : CFMS బిల్లులను తయారు చేస్తారు మరియు ఆ కార్పొరేషన్ల MD ల నుండి ఆ బిల్లులు జారీ చేస్తారు
» ఆగస్టు 12 2020 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంబించి అర్హుల అయిన ప్రతి ఒక్కరికీ 18,750 రూ వారి యొక్క బ్యాంక్ అకౌంటు లో జమ చేస్తారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags