Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP 15th July 2020 cabinet meeting decision

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశ ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్‌ మంత్రి మండలి సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. 
>వైఎస్సార్ చేయూత పథకం అమలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం పథకంపై కేబినెట్ చర్చింది.
>శాండ్ కార్పొరేష‌న్ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. శాండ్ కార్పొరేష‌న్‌లో ప్రతినిధులుగా పలువురు మంత్రులు ఉండ‌నున్నారు.. ఫైనాన్స్ మంత్రి సహా మరో ఇద్దరు లేదా ముగ్గురు మంత్రులకు చోటు క‌ల్పించ‌నున్నారు.
>సీపీఎస్ రద్దు కోసం డిమాండ్ చేసిన ఉపాధ్యాయులపై నమోదైన కేసులను ఎత్తేయడానికి మంత్రివర్గం అంగీకరించింది.
>ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు, శ్రీకాకుళంలల్లో కొత్తగా రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ అంగీకారం తెలిపింది.
>ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటివి రెండే ఉన్నాయి. కడప జిల్లా ఇడుపుల పాయ, కృష్ణాజిల్లా నూజివీడులో ఉన్నాయి. వాటికి అదనంగా ఒంగోలులో కొత్త విద్యాసంస్థను నెలకొల్పడానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
>నెల్లూరు జిల్లాలో దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిర్మించడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది.
>పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చించిన మంత్రివర్గం.
>మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ
>అగ్రికల్చరల్ ల్యాండ్ చట్టం 2006లోని 3, 7 సెక్షన్లు సవరించే అంశంపై చర్చ. ముసాయిదా ఆర్డినెన్స్ ఆమోద ప్రతిపాదనపై చర్చ
>ఏపీ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020పై చర్చ. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ప్రోత్సాహంపై చర్చ
>ఏపీఆర్‌ఎస్‌డీఎంపీసీఎల్‌ ఏర్పాటుపై చర్చ.
>గండికోట ప్రాజెక్టు పరిధి రైతులకు పరిహారం అందించడంపై చర్చ
>కడప జిల్లా కొండాపురం నిర్వాసితులకు రూ.145 కోట్ల చెల్లింపుపై చర్చ
>ఏపీఐఐసీ రూ.2 వేల కోట్లు టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతిపై చర్చ
>గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఖరారుపై చర్చ
కొత్త జిల్లాలపై చర్చ
>కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది.
>వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
>అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు.
>4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags