ఏపీ ఎంసెట్ తో
సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై రేపు నిర్ణయం !
విద్యామంత్రి
సమీక్షలో షెడ్యూల్ అమలుపై రాని స్పష్టత
ఏపీ ఎంసెట్ తో సహా అన్ని
ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించడం పై సోమవారం స్పష్టత వచ్చే అవకాశముంది. గతంలో
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి ఆగస్టు 8 వరకు సెట్స్ నిర్వహించాల్సి
ఉంది. ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఉన్నత విద్యాధికారులు, కన్వీనర్లతో శనివారం విద్యాశాఖ
మంత్రి ఆదిమూలపు సురేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పరీక్షల
నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని కన్వీనర్లకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు. అయితే
కరోనా లక్షణాలు ఉన్నట్లు విద్యార్థులు సమాచారమిస్తే వారికి ప్రత్యేక గదులను
ఏర్పాటు చేయాలని సమీక్షలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే నిర్దేశిత షెడ్యూల్
మేరకు పరీక్షల నిర్వహించే విషయమై ఈ భేటీలో స్పష్టత రాలేదు. వీటిపై తుది నిర్ణయం
తీసుకునేందుకు 13న మరోసారి భేటీ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఉన్నత
విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.
0 Komentar