జేఈఈ అడ్వాన్స్‌డ్
అర్హత నిబంధనల్లో మార్పులు
జేఈఈ అడ్వాన్స్‌డ్
అర్హత నిబంధనల్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మార్పులు చేసింది. ఇంటర్‌లో 75
శాతం మార్కులుండాలన్న అర్హత నిబంధనను తొలగించింది. ఇంటర్ లేదా 10+2లో ఉత్తీర్ణులైన అందరినీ అర్హులుగా నిర్ణయించింది. కరోనా మహమ్మారి కారణంగా
పలు బోర్డులు ఇంటర్మీడియట్ పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం
తీసుకున్నట్లు తెలిపారు.
ఐఐటీల్లో ప్రవేశం
పొందేందుకు జేఈఈ అడ్వాన్స్ లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, క్లాస్
12 బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, లేదా సంబంధిత
అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సంపాదించాల్సి ఉంటుంది. జేఈఈ
అడ్వాన్స్ కు జేఈఈ మెయిన్స్ అర్హత పరీక్షగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే. కరోనా
కారణంగా ఈ నిబంధనలకు తాజాగా సడలింపును ఇస్తున్నట్లు కేంద్ర హెచ్చార్టీ మంత్రి
రమేశ్ తెలిపారు. జేఈఈ మెయిన్స్ ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు, జేఈఈ అడ్వాన్స్ సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు.
0 Komentar