ICAI CA May 2020 exam cancelled: to merge with November exams
సిఏ పరీక్షలు మళ్ళీ వాయిదా...
సిఏ పరీక్షలు మళ్ళీ వాయిదా...
షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి మే 18
వరకు పరీక్షలు జరగాల్సిన చార్టెడ్
అకౌంటెంట్స్ పరీక్షలను కరోనా కారణంగా మరలా వాయిదా వేశారు. ఈ పరీక్షలు వాయిదా పడటం ఇది మూడోసారి.
కరోనా మహమ్మారి కారణంగా జూన్ 19 నుంచి జులై 4
వరకు నిర్వహిస్తామని చెప్పారు. కానీ, కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్న
తరుణంలో అప్పుడు కూడా వాయిదా వేశారు. జులై
29 నుంచి ఆగష్టు 16 వ తేదీ వరకు
పరీక్షలు నిర్వహిస్తామని జులై 4 వ తేదీన ఇన్స్టిట్యూట్ అఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్
ఇండియా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం దేశంలో
కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నది.
ఈ సమయంలో జులై 29 నుంచి నుంచి కూడా పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని, పరిస్థితులను బట్టి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహిస్తామని ఐసిఏఐ
ప్రకటించింది.
0 Komentar