ప్రైవేట్ పాఠశాలలు
ఆన్లైన్ క్లాసులు నిర్వహించకూడదు- మంత్రి ఆదిమూలపు సురేష్
కరోనా నేపథ్యంలో ఇంకా 2020-21 విద్యా సంవత్సరాన్ని ఖరారు
చేయలేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కానీ కొన్ని ప్రైవేట్
స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, అలా నిర్వహించడానికి వీల్లేదని
అన్నారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధులను వేధిస్తే మాత్రం ఊరుకునేది లేదని
అన్నారు. అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని,
ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదన్నారు.
నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఆగస్ట్ మూడో వారం నుంచి స్కూల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని ఈ సందర్భం గా మంత్రి వెల్లడించారు.
0 Komentar