Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

6 Amazing Tips To Reduce Gastric Problem Easily


6 Amazing Tips To Reduce Gastric Problem Easily
గ్యాస్ట్రిక్ సమస్యను సులభంగా తగ్గించే అద్భుతమైన 6 చిట్కాలు..

గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలైతే చాలు.. మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఈ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే.. ఈ సమస్యని తగ్గించుకునేందు కొన్నిసార్లు ఎలాంటి ఫలితం ఉండదు. అలాంటప్పుడు కొన్ని ఇంటిచిట్కాల ద్వారా ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. 

గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు.. కొన్ని ఇంటిచిట్కాల ద్వారా సహజసిద్ధంగానే వాటినుంచి బయటపడొచ్చు. దీనికి సంబంధించిన అనేక ఆహారపదార్థాలు మన వంటింట్లోనే అందుబాటులో ఉంటాయి. అవేంటో.. ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.. 

గ్యాస్ సమస్య అనేది ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే సమస్య. ఇది మన శరీరంలో మొదలై అలానే కొనసాగుతుంటే.. వరుసగా మరికొన్ని సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపు నిండి అనుభూతి ఉండడం.. తిమ్మిరి ఇలా ఉంటూనే గుండె దగ్గర మంటగా ఉంటుంది. వైద్యపరంగా అపానవాయువు(ఫ్లాట్యులెన్స్) అని వీటిని పిలుస్తారు. ఇది మీ జీర్ణ వ్యవస్థలో అదనపు వాయువుని కలిగి ఉంటుంది. అసలు సమస్య ఎందుకు వస్తుంది తెలుసుకోవడం కీలకం. . ఇది మీ జీర్ణవ్యవస్థలో గ్యాస్ రెండు విధాలుగా ఏర్పడుతుంది. 

తినేటప్పుడు, త్రాగేటప్పుడు లేదా నిద్రలో గురక పెట్టే సమయంలో మీరు మీ శరీరంలోకి ఆక్సిజన్ మరియు నత్రజనితో కూడుకుని ఉన్న గాలిని మింగడం సర్వసాధారణం. రెండో, మరింత ముఖ్యమైన కారణమేంటంటే, మీ శరీరం ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో హైడ్రోజన్, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులు ఎక్కువ మోతాదులో విడుదలవుతుంటాయి. ఇవి మీ కడుపులో పేరుకుపోతుంటాయి. ఇవి బయటకు విడుదల కాకపోవడంతో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ సమస్య, మీ రోజువారీ ఆహార పదార్థాల ఎంపికపై కూడా ఆధారపడి ఉంటుంది. 

బీన్స్, క్యాబేజీ, చిక్‌పీస్, కాయ ధాన్యాలు లేదా చక్కెరలతో కూడిన పండ్ల రసాలు వంటి అధిక కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాలు సులభంగా జీర్ణం కావు. అవి పెద్దప్రేగు గుండా ప్రయాణిస్తుంటాయి. అంతేకాకుండా ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి కూడా. ఇవి ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడినప్పటికీ, వాయువులను విడుదల చేసి మీకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. 

అయితే, ఇక్కడ మీరు సహజంగా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని కొన్ని వంటగదిలో దొరికే ఆహారపదార్థాలను ఎంచుకోవచ్చు. గ్యాస్ నివారణకోసం సూచించబడిన అద్భుతమైన గృహ నివారణా చిట్కాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇవి మీకు ఎంతగానో సహాయపడగలవు. 

1. అజ్వైన్ లేదా వాము: 

"వాము లేదా అజ్వైన్ విత్తనాలలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ రసాలను విడుదల చేస్తుంది" అని బెంగళూరుకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అంజు సూద్ వివరించారు. మంచి ఫలితాలను పొందడానికి రోజులో ఒకసారి అర టీస్పూన్ వామును నీటితో కలిపి వేడి చేసి తాగొచ్చు.. 

2. జీరా వాటర్ (జీలకర్ర నీళ్ళు): 

జీలకర్ర నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యలకు ఉత్తమ పరిష్కారం."జీరా( జీలకర్ర)లో కొన్ని ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి లాలాజల గ్రంథులను ఉత్తేజపరుస్తాయి, క్రమంగా ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా అదనపు వాయువు ఏర్పడకుండా చేస్తాయి" అని డాక్టర్ సూద్ వివరించారు. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని రెండు కప్పుల నీటిలో 10 నుండి 15 నిమిషాలు ఉడకబెట్టండి. మీ భోజనం పూర్తి చేసిన తర్వాత దానిని చల్లబరచండి, ఆపై వడకట్టి, నీటిని సేవించండి. 

3. అసఫోటిడా (హింగ్ లేదా ఇంగువ): 

డాక్టర్ సూద్ సూచిస్తున్నదాని ప్రకారం అర టీస్పూన్ ఇంగువను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా, గ్యాస్ సమస్యను అరికట్టవచ్చని తెలుస్తుంది. మీ కడుపులో అధిక వాయువును ఉత్పత్తి చేసే గట్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే “యాంటీ ఫ్లాటులెంట్” వలె ఇంగువ పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఇంగువ శరీరం యొక్క వాత దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ‘ఆయుర్వేద గృహ చిట్కాలు’ అనే పుస్తకంలో డాక్టర్ వసంత లాడ్ వాత దోషంలో పెద్దప్రేగు ప్రధాన భూమికను పోషిస్తుందని, మరియు ఇది వాయువుకి సంబంధించిన దోషమని వివరించారు. పెద్దప్రేగులో వాత దోషం పెరిగినప్పుడు, వాయువులు అధికమవుతాయి. 

4. తాజా అల్లం: 

డాక్టర్ వసంత లాడ్ సూచన ప్రకారం, గాస్ట్రిక్ సమస్యకు తగ్గించేందుకు భోజనం అనంతరం ఓ టీస్పూన్ తాజా అల్లం తురుముని ఒక టీస్పూన్ నిమ్మరసంతో తీసుకోవాలి. అల్లం టీ తాగడం కూడా గ్యాస్ ఉపశమనానికి సమర్థవంతమైన ఇంటి నివారణగా చెప్పబడుతుంది. అల్లం సహజమైన కార్మినేటివ్ (అపానవాయువు నుండి ఉపశమనం కలిగించే ఏజెంట్లు) గా పనిచేస్తుంది.

5. బేకింగ్ పౌడర్ నిమ్మరసం మిశ్రమం: 

జీర్ణసమస్యలను తగ్గించేందుకు ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ వసంత లాడ్ సూచించిన మరో సులభమైన గృహ చిట్కా నివారణ ఏమిటంటే, 1 టీస్పూన్ నిమ్మరసం, సగం టీస్పూన్ బేకింగ్ సోడాను ఒక కప్పు నీటితో కలిపి సేవించడం. ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేసే కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడటానికి సహాయపడుతుంది. కాబట్టి మీ భోజనం తర్వాత దీనిని తీసుకోవచ్చు. 

6. త్రిఫల: 

మూలికా పొడి అయిన త్రిఫల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించేందుకు అద్భుతంగా సహాయపడుతుంది. సగం టీస్పూన్ త్రిఫల పొడిని వేడి నీటిలో 5 నుండి 10 నిమిషాలు ఉంచి, పడుకునే ముందుగా ఈ ద్రావణాన్ని సేవించాలి. ఈ మిశ్రమంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి.. తగిన మోతాదులో తీసుకోవాలని గుర్తుంచుకోండి. అధికంగా తీసుకున్న పక్షంలో ఉబ్బరానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. 

వాస్తవానికి, అపానవాయువు అనేది ఒక సాధారణమైన పరిస్థితి మరియు ఈ సమస్యను ఎదుర్కోని వారు ఉండరు. కానీ సమస్య తగ్గకుండా ఎక్కువవుతుంటే, ఇది లాక్టోస్ టోలరెన్స్, హార్మోన్ల అసమతుల్యత లేదా ఒక రకమైన ప్రేగు సంబంధిత తీవ్రమైన సమస్యలకు సంకేతంగా మారుతుంది. తరచుగా మాత్రల మీద ఆధారపడడం కన్నా, వీలైనంతవరకు సహజసిద్దమైన పరిష్కార మార్గాలను ఆశ్రయించడం ఎప్పుడూ కూడా మంచిదే.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.

Previous
Next Post »
0 Komentar

Google Tags