7 Surprising Benefits of Honeydew Melon
బీపీతో బాధపడేవారు తప్పకుండా
తినాల్సిన పండు
ఎవరైతే అదనపు వెయిట్ ను
తగ్గించుకోవాలనుకుంటున్నారో వారు తమ డైట్ లో వెజిటబుల్స్ కు అలాగే ఫ్రూట్స్ కు
స్థానం కల్పించాలి. ఈ ఫ్రూట్ కు వెయిట్ వాచర్స్ ఫ్రెండ్లీ ఫుడ్ అని పేరుంది.
ఇందులో కేలరీస్ తక్కువగా లభిస్తాయి.
హనీడ్యూ మెలన్ ని గ్రీన్ మెలన్ అని
కూడా అంటారు. వివిధ సైజులలో ఇది లభ్యమవుతుంది. సాధారణంగా ఇవి ఓవల్ షేప్ లో ఉంటాయి.
గ్రీన్ మెలన్ ని ఒక కప్పుడు తీసుకుంటే అందులో 64 కేలరీలు మాత్రమే ఉంటాయి.
అలాగే 1.4 గ్రాముల ఫైబర్ కూడా లభిస్తుంది. ఇందులో యాంటీ
ఆక్సిడెంట్ విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అలాగే ఎలెక్ట్రోలైట్ పొటాషియం కూడా
ఉంటుంది. ఇది శరీరంలో ఫ్లూయిడ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేయడానికి బాగా హెల్ప్
చేస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ది
బెస్ట్ ఫ్రూట్ కిందకి వస్తుంది. గ్రీన్ మెలన్ ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్
పొందవచ్చు. అవేంటంటే...
1.వెయిట్ లాస్:
ఎవరైతే అదనపు వెయిట్ ను
తగ్గించుకోవాలనుకుంటున్నారో వారు తమ డైట్ లో వెజిటబుల్స్ కు అలాగే ఫ్రూట్స్ కు
స్థానం కల్పించాలి. ఈ ఫ్రూట్ కు వెయిట్ వాచర్స్ ఫ్రెండ్లీ ఫుడ్ అని పేరుంది.
ఇందులో కేలరీస్ తక్కువగా లభిస్తాయి. అలాగే, సోడియం కూడా తక్కువే.
ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ ఎక్కువ. వీటి వల్ల ఆకలి తీరిన సంతృప్తి కలుగుతుంది.
కాబట్టి, వెయిట్ లాస్ కోసం ప్రయత్నించేవారు ఈ ఫ్రూట్ ను తమ
డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ పొందుతారు.
2.ఇమ్యూనిటీ బూస్టర్‌లా :
హానీ డ్యూ మెలన్ లో ఇమ్యూన్
సిస్టమ్ ను బూస్ట్ చేసే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి లభిస్తుంది. ఒక కప్పు గ్రీన్
మెలన్ నుంచి రోజువారీ రికమెండేడ్ డైటరీ ఇంటేక్ లో సగానికి సగం లభిస్తుంది.
అందువల్ల ఇది మీ డైట్ లో యాడ్ చేసుకునేందుకు గొప్ప ఆప్షన్. విటమిన్ సి అనేది
శరీరంలోని నేచురల్ డిఫెన్సెస్ ను సపోర్ట్ చేస్తుంది. బ్రెయిన్ పనితీరును కూడా
మెరుగుపరుస్తుంది. తగినంత విటమిన్ సి తీసుకుంటే సాధారణ జలుబుతో పాటు న్యుమోనియా
వంటి రెస్పిరేటరీ రిస్క్స్ తగ్గుతాయని తేలింది. ఈ ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ సమృద్ధిగా
లభిస్తుంది. శరీరాన్ని సెల్యులార్ లెవెల్స్ నుంచి హైడ్రేట్ చేస్తుంది. ఇందులో
పొటాషియం అధికంగా లభిస్తుంది. కాబట్టి సోడియం నుంచి ఎదురయ్యే హానికర ప్రభావాలను
తగ్గిస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్ బాలన్స్ ను మెయింటైన్ చేస్తుంది. సమ్మర్ లో ఈ
ఫ్రూట్ జ్యూస్ ఎండవేడి నుంచి ఉపశమనం ఇస్తుంది.
3.హై బ్లడ్ ప్రెజర్ దూరం :
ఈ ఫ్రూట్ లో పొటాషియంతో పాటు వాటర్
కంటెంట్ అధికంగా లభిస్తుంది. అలాగే సోడియం లెవెల్స్ ఇందులో పూర్తిగా తక్కువ.
అందువల్ల,
ఇది హై బ్లడ్ ప్రెజర్ ను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. హై బ్లడ్
ప్రెజర్ తో బాధపడేవారు సోడియాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. వారికి ఈ ఫ్రూట్
ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఇందులో ఒక యావరేజ్ సైజ్ అరటిపండులో లభించేంత పొటాషియం
లభిస్తుంది. కేలరీలు తక్కువే. పొటాషియంతో పాటు ఇందులో ఫైబర్, విటమిన్ సి అలాగే కొలిన్ కంటెంట్ ఉంటాయి. ఇవన్నీ హార్ట్ హెల్త్ కు మంచివి.
4.గర్భిణీలకు మంచిది:
గర్భిణీలు తాము తీసుకునే ఆహారం
పట్ల ఎంతో కేర్‌ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే, వారు తినే ఆహారం వారి
మీదే కాదు, వారి బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుంది. గర్భస్థ
శిశువు ఆరోగ్యంగా ఎదగాలంటే పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
గర్భిణీలకు గ్రీన్ మెలన్ ద్వారా హెల్త్ బెనిఫిట్స్ అందుతాయి. ఈ ఫ్రూట్స్ లో
కేలరీలు తక్కువ, అలాగే పోషకాలు ఎక్కువ. సాధారణంగా
ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే హెల్త్ ప్రాబ్లెమ్స్ ను ఫేస్ చేసే ఎబిలిటీ ఈ ఫ్రూట్
తింటే లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ ఫ్రూట్ ఇమ్యూన్ సిస్టమ్ ను బూస్ట్
చేస్తుంది.
5.హార్ట్ హెల్త్:
ఇది హార్ట్ హెల్త్ ను ఇంప్రూవ్
చేసే ఫుడ్. శరీరంలో హోమోసైస్టెయిన్ అనే ఎమినో యాసిడ్ మోతాదు ఎక్కువైతే హార్ట్
రిస్కులు పెరుగుతాయి. ఇది మీట్ ద్వారా లభిస్తుంది. ఇది అధికమైతే గుండె మరియు
కిడ్నీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అలాగే, బోన్ మినరల్ లాస్ కూడా
ఏర్పడుతుంది. ఈ హనీ డ్యూ మెలన్ లో ఫోలేట్ తో పాటు విటమిన్ బి6 సమృద్ధిగా లభిస్తాయి. ఈ రెండూ హోమోసైస్టెయిన్ ను బ్రేక్ డౌన్ చేయడానికి
హెల్ప్ చేస్తాయి. ఇందులో లభించే పొటాషియం వల్ల ఇర్రెగులర్ హార్ట్ బీట్ సమస్య
తలెత్తదు. అలాగే బ్లడ్ సర్క్యూలేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అదే విధంగా.. కంటి ఆరోగ్యం
మెరుగ్గా ఉండడానికి ల్యూటీన్ తో పాటు జిగ్జాంథిన్ అనే రెండు శక్తివంతమైన
ఫైటోన్యూట్రియెంట్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. గ్రీన్ మెలన్ లో ఈ రెండూ పుష్కలంగా
లభిస్తాయి. తద్వారా, కేటరాక్ట్స్, ఏజ్
రిలేటెడ్ బ్లైండ్ నెస్, ఏజ్ రిలేటెడ్ మాకులర్ డిజెనెరేషన్
రిస్కులు తగ్గుతాయి.
6. జీర్ణ సమస్యలు దూరం..
హానీ డ్యూ మెలన్ లో సాల్యుబుల్
మరియు ఇంసాల్యుబుల్ డైటరీ ఫైబర్స్ లభిస్తాయి. ఇవి శరీరం నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్
ను బయటికి పంపించే ప్రాసెస్ కు హెల్ప్ చేస్తాయి. సాల్యుబుల్ ఫైబర్ అనేది
లోగ్లైసెమిక్ ప్రాపర్టీస్ కలిగినది. ఈ క్వాలిటీ వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో
ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్ కూడా హెల్తీగా ఉంటుంది. డైజెషన్ సిస్టం
పనితీరు సరిగ్గా ఉండటం వల్ల ఈ రెండూ కూడా కంట్రోల్ లో ఉంటాయి.
7. బోన్ హెల్త్:
ఈ ఫ్రూట్ లో బోన్స్ ను ధృడంగా ఉంచే
మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అవేంటంటే, కేల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. అలాగే ఇందులో
లభించే ఫోలేట్ అనే ముఖ్యమైన మాక్రో న్యూట్రియెంట్ కూడా బోన్ హెల్త్ కు సపోర్ట్
చేస్తుంది. కాబట్టి, ఈ ఫ్రూట్ ను డైలీ డైట్ లో భాగం చేసుకోవడం
వల్ల బోన్స్ ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటు ఇందులో సి మరియు కాపర్ సమృద్ధిగా
లభిస్తాయి. ఈ రెండూ స్కిన్ ను హెల్తీగా ఉంచుతాయి. విటమిన్ సి లో యాంటీ ఆక్సిడేటివ్
ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది స్కిన్ కేర్ కు ఎంతో హెల్ప్ చేస్తుంది. యూ వీ రేస్ నుంచి
స్కిన్ ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్రూట్ ను తినడం ద్వారా స్కిన్ లోపలి నుంచి
హెల్తీగా ఉంటుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ ఫ్రూట్ నుంచి అందుతున్నాయంటే
ఆశ్చర్యంగా ఉంది కదూ.
0 Komentar