Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ICET Results Released – Download Rank Cards from Sep 30



AP ICET Results Released – Download Rank Cards from Sep 30
‘ఏపీ ఐసెట్‌’ ఫలితాలు విడుదల - 30 నుంచి ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌

78.65 శాతం మంది క్వాలిఫై 
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్‌ 2020 పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం  విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలను ప్రకటించారు. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ ఏపీ ఎంసెట్‌ పరీక్షను ఈనెల 17వతేదీ నుంచి 25 వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా  నిర్వహించామని మంత్రి సురేష్‌ చెప్పారు.

ఎస్వీయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదువుతున్న డి.ఫణిత్‌ నవంబర్‌లో జరిగే క్యాట్‌ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతూ ఐసెట్‌లో ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు.

ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహించిన ఏపీ ఐసెట్‌ పరీక్షలకు 64,884 మంది దరఖాస్తు చేయగా 51,991 మంది హాజరయ్యారు. పరీక్షల్లో 40,890 మంది (78.65 శాతం) అర్హత సాధించారు. మొత్తం 45 నగరాల్లో 75 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.
ఎంబీఏ కోర్సును 352 కాలేజీలు అందిస్తుండగా ఎంసీఏ కోర్సును 130 కాలేజీలు నిర్వహిస్తున్నాయి. 
ఎంబీఏలో 44084 సీట్లు, ఎంసీఏలో 8,558 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటాలో ఎంబీఏలో 31368 సీట్లు, ఎంసీఏలో 6,229 సీట్లు భర్తీ చేయనున్నారు. మిగతావి మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాల్లో భర్తీ కానున్నాయి. 
ఈసారి ఐసెట్‌ను శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించింది. గతేడాది కంటే  ఈసారి పరీక్షకు అభ్యర్థుల సంఖ్య పెరిగింది.
ఈ నెల 30 నుంచి ర్యాంకు కార్డులను  డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.  ఈసారి అర్హత సాధించిన వారి కన్నా 11,752 సీట్లు ఎక్కువగా ఉండటం విశేషం.


Previous
Next Post »
0 Komentar

Google Tags