Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Can We Go to Flashback for Memories?



Can We Go to Flashback for Memories?

80, 90 దశకం లో పుట్టిన మనం రెండు తరాలకు సాక్షులం       

=====================

> స్వచ్చమైన గాలి, నీళ్ళు, పచ్చటి పొలాలు, పరిశుభ్రమైన వాతావరణం లో పుట్టి, పెరిగిన   వాళ్ళం.

> తలపై నుండి చెంపల మీదకు కారిపోయేలా నూనె రాసుకుని...📚 చేతికి పుస్తకాల సంచి తగిలించుకుని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను కలుస్తూ పెద్దగుంపుగా 👦👩👧 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం వాళ్ళం. 🚶🏃

> జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు లాక్కుంటూ చిరుగు బొక్కలకు గుడ్డ ముక్కలు    అతుకులేయించుకున్న వాళ్ళం.

> 10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు వేసుకున్న తరం మనదే...

> గోలీలు, బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ, ఉప్పాట, ఏడు పెంకులాట.....🥎 బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకుంటే బంతి లాగు మరియు వంటి మీద ముద్ర పడే ముద్రబాల్ లాంటి ఆటలాడిన తరం.

> బడికి వేసవి కాలం సెలవులు రాగానే తాటి చెట్లూ, సీమ, తుమ్మ చెట్లూ, ఈతచెట్లు ఎక్కి కాయలు కోసుకొని తిన్న వాళ్ళం.

> చెరువులు, కాలవల్లో స్నానాలు చేసిన వాళ్ళం.

> తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...

> 5 పైసల ఐస్ తిన్నది మనమే.

> పది పైసలతో బళ్ళో మ్యాజిక్ షో చూసింది మనమే....

> 🌦️ వర్షం వస్తె తాటాకు గొడుగూ, యూరియా సంచులు, కప్పుకుని బడికి వెళ్ళిన    వాళ్ళం.

> 📖 సెకెండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్ కోసం పరీక్షలు అయినప్పటి నుండి ముందు తరగతి   వాళ్ళని బతిమాలిన తరం.

>🚴పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లo మనమే...

>✉️ ఉత్తరాలు రాసుకున్న.. అందుకున్న తరంవాళ్ళం...

>🌴 పండగ సెలవులు, వేసవి సెలవులు, దసరా, సంక్రాంతి సెలవులు ఎన్ని సెలవులు వచ్చినా  ఐదు పైసలు ఖర్చులేకుండా ఆనందాన్ని. 🤼🏃🏻⚽🏸🪁🏹🤸🏊 అనుభవించిన తరం..

> 👨👩👧👦 పెద్దలు, పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో     సాయంత్రాలు / రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకుని, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మనమే.... ☘️

> ఊర్లో ఎవరి ఇంట్లో ఏ వేడుక  జరిగినా, మన ఇంట్లో జరిగినట్లు, అంతా మాదే, అంతామేమే, అన్నట్లుగా భావించి స్వచ్చందంగా, నిస్వార్థంగా పాలుపంచుకున్న తరం   మనదే...🍁

> ఊర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని, పిల్లలు అందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ   ఎన్నో రాత్రులు 🔦టార్చిలైట్స్, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం మనమే.

> 🕉️🚩🛕 ప్రతీ పండగను, పండగల్లోని సంతోషాలను, సంబరాలను ఆస్వాదించింది మనమే🌽🍬🍬

>👨👩👧👧 చుట్టాలు వస్తేనే అమ్మ కోడి కూర వండి పెట్టిన తరం....🍁

> అత్తయ్యా, మామయ్య, పిన్ని, బాబాయ్, అక్కా, బావ అంటూ ఆప్యాయంగా    పిలుచుకున్న తరం

> స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం...

> పుల్లల పొయ్యి మీద అన్నం, కూర ఉడుకుతున్నప్పడు వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం  వాళ్ళం...

> పొయ్య మీద నుంచి నేరుగా పళ్ళెంలోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ,    వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మా, నాన్నా, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, అక్కలు, చెల్లెళ్లు, అన్నయ్యలు   తమ్ముళ్లు అందరం ఒకే దగ్గర చేరి మధురమైన అనుభూతితో కూర్చుని అన్నం తిన్న    తరం ...🦋

> అమ్మమ్మలు, నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది, అనగనగా ఒక రాజు.... కథలు   విన్నది, నూనె పిండితో నలుగు పెట్టించుకుని, కుంకుడు కాయ పులుసుతో తలంటు   స్నానం చేయించుకున్న తరం...🍀

> 📻 రేడియో, దూరదర్శన్📺, టూరింగ్ టాకీస్📽️ కాలం చూచిన వాళ్ళం...🍁

>🎥 40 పైసల నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని, 1.20 రూపాయల బెంచీ టిక్కెట్ తో, 2 రూపాయాల టికెట్ కుర్చీ లో కూర్చుని సినిమాచూచిందీ మనమే..

> స్కూల్, కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం...🍂

> అమ్మా నాన్నా తో సంవత్సరానికి ఒకసారి, పరీక్ష పాస్ అయ్యావా...అని మాత్రమే    అడిగించుకున్న తరం వాళ్ళం...

> 📲🖥️🖨️ ప్రస్తుతం ఉన్న WhatsApp, FB, Instagram లు ఈ తరం తో పాటు సమానంగా వాడేస్తున్న తరం...

=====================

మనమే ఆ తరానికి ఈ తరానికి మధ్యవర్తులం... మనమే  💐

అవును.......రెండు తరాల మద్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మనమే  సాక్షులం.

ధన్యవాదాలు

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags