Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chandamama Artist Shankar Dies – Famous with ‘Bethala’ bommalu



Chandamama Artist Shankar Dies – Famous with ‘Bethala’ bommalu
చందమామ ఆర్టిస్ట్ శంకర్ కన్నుమూత భేతాళ బొమ్మలు తో ప్రసిద్ధం

ప్రసిద్ధి గాంచిన సీనియర్ ఆర్టిస్ట్, చందమామ శంకర్ కన్నుమూశారు. వయసురీత్యా సమస్యలతో బాధపడుతోన్న ఆర్టిస్ట్ శంకరన్ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

ప్రముఖ చిత్రకారుడు కరథొలువు చంద్రశేఖరరన్ శివశంకరన్ (97) కన్నుమూశారు. ‘చందమామ’శంకర్‌ (Chandamama Artist Shankar)గా ప్రసిద్ధి గాంచిన సీనియర్ ఆర్టిస్ట్ గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం చందమామ శంకర్ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. దాదాపు 60 ఏళ్లపాటు చందమామ కథలకు బొమ్మలు గీసి విశేష సేవలు అందించి మన్ననలు పొందారు శంకరన్.

తమిళనాడులోని ఈరోడ్, కరథొలువు గ్రామంలో 1924 జులై 24న జన్మించారు శంకర్. చిన్ననాటి నుంచే బొమ్మలు గీయడంలో ఆసక్తి ఉన్న శంకర్ 1946లో కళైమాగల్ అనే పత్రికలో కార్టూనిస్ట్‌ (చిత్రకారుడు)గా చేరారు. 1952లో చందమామ కథల పుస్తకాలకు బొమ్మలు గీయడం మొదలుపెట్టిన శంకరన్.. 2012లో పత్రిక మూతపడేవరకు 6 దశాబ్దాలపాటు అక్కడ పనిచేశారు. కొన్ని తరాల వారు చందమామ తాతయ్య శంకర్‌ను అభిమానించేవారు. ఆయన బొమ్మలు నిజ రూపాన్ని కళ్లముందుకు తీసుకొచ్చినట్లుగా ఉండేవి.

పేరు తెచ్చిన బేతాళుడు
చందమామ కథలు చదివేవారికి గుర్తొచ్చే విషయాలు ఒకటి బేతాళుడు, రెండోది విక్రమార్కుడు. బేతాళ కథలలోని విక్రమార్కుడు ఒక చేతిలో కత్తి పట్టుకుని, భుజంపైన శవాన్ని మోసుకుంటూ వెళ్తున్నట్లుగా ఉండే ఈ చిత్రం శంకర్‌కు ఎంతో పేరు తీసుకొచ్చింది. ఎన్నో పురాణా పాత్రలు, కథలకు శంకర్ వేసిన బొమ్మలు ప్రాణం పోశాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags