Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Drinking water in a copper vessel balances the body


Drinking water in a copper vessel balances the body
రాగి పాత్రలోని నీరు తాగితే శరీరంలోని మూడు దోషాలూ బ్యాలెన్స్ అవుతాయి
ఆయుర్వేదం ప్రకారం రోజూ పొద్దున్నే పరగడుపున రాగి పాత్రలోని నీటిని తాగితే శరీరంలోని కఫ, వాత, పిత్త దోషాలను బ్యాలెన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది కూడా. రాగిపాత్రలోని నీటిని తాగడం వల్ల ఇంకా ఏమేం లాభాలు ఉన్నాయో తెలుసుకోండి..

భూమి మీద ప్రాణులు బతకాలంటే నీరు అత్యవసరం. మానవ శరీరంలో కూడా డెబ్భై శాతం నీరే ఉంది. అందుకే నీరు మనకి ప్రాణాధారం అని చెప్పొచ్చు. ఇకపోతే పూర్వకాలంలో మన వాళ్ళు నీటిని రాగి పాత్రల్లో నిల్వ చేసేవారు. మనం ఇవాళ వాటర్ ప్యూరిఫైయర్ల తో నీటిని శుద్ధి చేసుకుంటున్నాం. కానీ, ఇదే పని రాగి పాత్ర కూడా చేస్తుంది. ఆయుర్వేదం లో చెప్పినదాని ప్రకారం ఈ విషయాన్ని ఇవాళ కొన్ని పరిశోధనలు కూడా ప్రూవ్ చేస్తున్నాయి. రాగి పాత్ర నీటిని సహజ పద్ధతుల్లో శుద్ధి చేస్తుంది. శరీరానికి హాని చేసే బాక్టీరియా, మైక్రో ఆర్గానిజం, ఫంగస్...వంటి వాటిని రాగి చంపేసి, నీటిని తాగడానికి పనికొచ్చే విధంగా మారుస్తుంది. అంతే కాదు, రాత్రాంతా రాగి పాత్ర లో ఉన్న నీటికి రాగి నుంచి ఒక మంచి గుణం వస్తుంది. మన ఆరోగ్యానికి కావాల్సిన మినరల్స్‌లో రాగి ఒకటి. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-కార్సినోజెనిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ని బయటికి పంపిస్తాయి. 

1.ఎనీమియా రాకుండా. 
శరీరం లో జరిగే చాలా ప్రాసెస్ ల లో కాపర్ ప్రముఖంగా ఉంటుంది. సెల్ ఫార్మేషన్ దగ్గర్నించీ, ఐరన్ అబ్జార్ప్షన్ వరకూ కాపర్ లేకుండా ఏ పనీ జరగదు. అందువల్లనే కాపర్ ఎనీమియా రాకుండా చేస్తుంది. రాగిలో బాక్టీరియా ని నశింపచేసే గుణాలు ఉన్నాయి. ఇది ఈ.కోలీ లాంటి బాక్టీరియాని కూడా చంపగలదు. దీంతో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

2.బరువు తగ్గడం. 
రెగ్యులర్ గా రాగి పాత్ర లో ని నీటిని తాగితే అది తొందరగా కొవూని కరిగించడమే కాక దాన్ని బయటికి పంపేస్తుంది కూడా. అంటే శరీరం తనకి ఏం కావాలో అవి మాత్రం ఉంచుకుని మిగిలిన వాటిని పంపించడంలో రాగి సహకరిస్తుంది. ఒక్క మాట లో చెప్పాలంటే డీటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణసమస్యలు దూరం అవుతాయి. రాగి పాత్ర లోని నీరు హానికరమైన బాక్టీరియా ని చంపేసి అల్సర్స్ నీ, ఇండైజెషన్ నీ, ఇంఫెక్షన్స్ నీ తగ్గిస్తుంది. అంతే కాదు, ఆహారం లోని ఇతర పోషకాలు శరీరం అందుకునేలా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం మంచిది..రాగి శరీరానికి ఆహారం ద్వారానే అందాలి. సీ ఫుడ్, ఆర్గన్ మీట్, హోల్ గ్రెయిన్స్, పప్పులు, గింజలు, చాక్లేట్, బంగాళా దుంపలు, బఠానీలు, ముదురురంగు ఆకుకూరల నుంచి మనకి రాగి లభిస్తుంది. రాగి పాత్రలో నిల్వ ఉంచి నీటిని రోజుకి రెండు మూడు గ్లాసులు తాగినా కూడా రాగి శరీరానికి అందుతుంది.

3.గుండె సమస్యలు, కాన్సర్‌ రాకుండా. 
రాగి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అంతే కాదు, రాగి బీపీ ని కంట్రోల్ లో ఉంచి చెడు కొలెస్ట్రాల్ నీ, ట్రైగ్లిసరైడ్స్ నీ తగ్గిస్తుంది. అంతేనా, కాన్సర్ ముప్పు ని తగ్గిస్తుంది. కాన్సర్ రావడానికి ప్రధాన కారణం శరీరం లోని ఫ్రీ రాడికల్స్. రాగి వాటితో పోరాడి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంటే ఆటోమేటిగ్గా కాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.


4.యవ్వనంగా కనిపించేలా. 
మీ ముఖం మీద ముడతలు కనపడకూడదని మీరనుకుంటే మీకిది మంచి ఆప్షన్. ఈ నీరు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వయసు కనిపించనివ్వకుండా చేస్తుంది. రెగ్యులర్‌గా తాగితే ఆ తేడా మీకే తెలుస్తుంది. రాగి మంచిది కాబట్టే ఇప్పుడు చాలా మంది కాపర్ బాటిల్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో పాటు చర్మానికి చాలా మంచిది. శరీరం లో మెలనిన్ ఉత్పత్తి అవ్వడంలో కాపర్ పాత్ర చాలా ఉంది. పైగా అది చర్మాన్ని స్మూత్ గా ఉంచుతుంది.

5.గాయాలు తగ్గించడంలో. 
ఇందులో ఉన్న యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాల వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. అంతే కాదు, ఇది మన ఇమ్యూన్ సిస్టంని బాగా స్ట్రాంగ్ గా చేస్తుంది. పైకి కనిపించే గాయాలే కాదు, పొట్ట లోపల ఉండే వాటిని కూడా ఈ నీరు తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా తాగడం మంచిది.


6.థైరాయిడ్, ఆర్థరైటీస్ అదుపులో. 
థైరాయిడ్ డిసీజెస్ తో బాధ పడుతున్నవారందరిలో ఉండే ఒక కామన్ ప్రాపర్టీ వారి శరీరంలో కాపర్ తక్కువ ఉండడమే అని నిపుణుల అభిప్రాయం. అందువల్లే, రాగి పాత్ర లో నీరు థైరాయిడ్ ప్రాబ్లంస్ రాకుండా చేస్తుంది. దీంతో పాటు ఆర్థ్రైటిస్ ని అదుపులో ఉంటుంది.

కాపర్ లో ఉన్న యాంటీ-ఇంఫ్లమేటరీ ప్రాపర్టీస్ వాపునీ, నొప్పినీ తగ్గిస్తాయి. అంతే కాదు, అది ఇమ్యూన్ సిస్టం ని బలోపేతం చేసి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కాపర్ వాటర్ బాటిల్స్ వైపు, వంట సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags