Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Warns Customers: If you make a mistake in WhatsApp, Your balance will be empty




SBI Warns Customers: If you make a mistake in WhatsApp, Balance will be empty
ఎస్‌బిఐ హెచ్చరిక: వాట్సాప్‌లో ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అయిపోద్దీ
క్షణాల వ్యవధిలో మీ ఖాతాలో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.

సైబర్ మోసగాళ్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే క్షణాల వ్యవధిలో మీ ఖాతా (State Bank of India)లో బ్యాలెన్స్ మొత్తం ఊడ్చేస్తారని ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. ఈ మేరకు ట్వీట్ ద్వారా కొన్ని విషయాలలో జాగ్రతగా ఉండాలని వివరించింది. లేని డబ్బు కోసం ఆశపడితే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బుకే ఎసరుపెడతారని గమనించాలి.

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు (CyberCrimes) కొత్త పంథాలో మోసాలకు పాల్పడుతున్నారట. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్‌లో గడుపుతున్నారని, వాట్సాప్ లక్ష్యంగా చేసుకుని లింక్‌లు పంపి మీ బ్యాంకు ఖాతాల నగదును దోచేస్తున్నారని తమ ఖాతాదారులను ఎస్‌బీఐ హెచ్చరించింది. మీ అలర్ట్‌గా ఉండకపోతే మోసపోతారని వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా ఎలా మోసపోతున్నారో తెలిపింది. ఆ పనులు చేయవద్దని సూచించింది.

ఇలా మోసాలు జరగుతాయి.. హెచ్చరించిన ఎస్‌బీఐ
మీరు లాటరీ గెలుచుకున్నారని, మీ ఎస్‌బీఐ బ్యాంకు నెంబర్ నుంచి సంప్రదించాలని సూచిస్తారు.
వాస్తవానికి ఖాతాదారుల బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలుసుకునేందుకు ఎస్‌బీఐ మీకు ఫోన్ కాల్స్ చేయదు. ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ కాల్స్ రూపంలోనూ వివరాలను బ్యాంకు సిబ్బంది అడగరని గుర్తుంచుకోండి.
ఎస్‌బీఐ నుంచి ఎలాంటి లాటరీ స్కీమ్ లేదు. లక్కీ కస్టమర్ గిఫ్ట్స్ కూడా మేం అందించడం లేదు. కేవలం మిమ్మల్ని నమ్మించేందుకే ఈ విషయాలు మెస్సేజ్ చేయడం లేక ఫోన్ కాల్ ద్వారా మీకు చేరవేస్తారు.
మీరు కనీసం ఒక్క తప్పు అయినా చేయకపోతారా అని సైబర్ నేరగాళ్లు ఎదురుచూస్తుంటారు. అందుకు అలాంటి ఫేక్ కాల్స్, ఫార్వర్డ్ మెస్సేజ్‌లను వాట్సాప్‌లోగానీ, జనరల్ ఫోన్ కాల్స్‌లో గానీ వస్తే వాటిని నమ్మవద్దు.
మీరు ఈ విషయాన్ని మీ కుటుంబసభ్యులకు, సన్నిహితులు, స్నేహితులకు కూడా మెస్సేజ్ ఫార్వర్డ్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయాలని ఎస్‌బీఐ తన ట్వీట్‌లో పేర్కొంది.


Previous
Next Post »
0 Komentar

Google Tags