Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Free health care for Indian students .. UK Good News



 Free health care for Indian students .. UK Good News
భారతీయ విద్యార్థులకు ఉచిత ఆరోగ్య సేవ.. బ్రిటన్ తీపికబురు
UK: భారతీయ విద్యార్థులకు యూకే ఆరోగ్య భరోసా కల్పించింది. ఆ దేశంలో ఉచిత వైద్య సేవలకు అవకాశం కల్పించింది.

భారతీయ విద్యార్థులకు యూకే ప్రభుత్వం శుభవార్త అందించింది. జాతీయ ఆరోగ్య సేవకు అర్హులుగా ప్రకటించింది. సర్‌చార్జి చెల్లిస్తే భారతీయ విద్యార్థులకు ఆ దేశంలో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. విదేశీ విద్యకు సంబంధించి ఇప్పటివరకు ఒక దేశం తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇదొకటని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ (ఐ.హెచ్.ఎస్.) చెల్లించడం ద్వారా భారతీయ విద్యార్థులు యూకేలో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఇది యూకే ప్రవేశపెట్టిన ప్రపంచ ప్రసిద్ధ సమగ్ర జాతీయ ఆరోగ్య సేవ పథకానికి ఫీజు చెల్లించకుండానే మినహాయింపు ఇస్తుందని ఆ దేశ వైద్య శాఖ ప్రకటించింది. విద్యార్థులు తమ ఇమ్మిగ్రేషన్ అనుమతి కాలానికి ఆరోగ్య సర్‌చార్జిని సరిగ్గా పాటిస్తే ఆరోగ్య సౌకర్యాలను ఉచితంగా పొందగలరని స్పష్టం చేసింది.

ఈ పథకం కింద స్థానిక వైద్యుడి మొదలు అత్యవసర సేవలు, ఎన్.హెచ్.ఎస్. కింద అవసరమైన హాస్పిటల్ చికిత్సలు, సలహాలను పొందవచ్చునని యూకే ప్రభుత్వం తెలిపింది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ (ఐ.హెచ్.ఎస్.)ని యూకే వీసా దరఖాస్తులో భాగం చేయనున్నారు. విద్యార్థి, యువత మొబిలిటీ వీసాల కోసం సంవత్సరానికి 300 పౌండ్లు కేటాయించనున్నారు.

ఇక భారతీయ కుటుంబాలు విదేశీ విద్య కోసం యూకేను నమ్మకంగా ఎంచుకోవచ్చని యూకే స్టడీ గ్రూప్, ఈయూ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ పిట్‌మ్యాన్ అన్నారు. ‘యూకే అద్భుతమైన ఆరోగ్య సేవలకు కూడా ప్రసిద్ది చెందింది. ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్‌చార్జ్ ద్వారా ఇబ్బంది లేకుండా ఉచిత ప్రవేశం కల్పించడం.. యువత విద్య, కెరీర్‌లో దూసుకెళ్లేందుకు దోహదపడుతుంది’ అని ఆయన అన్నారు.

25 ఏళ్లకు పైగా అంతర్జాతీయ విద్యార్థులకు బోధన, స్వాగతం పలికిన సంస్థగా ‘స్టడీ గ్రూప్’కు విశేష అనుభవం ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘విద్యార్థులు నివసించేటప్పుడు, ఇంటి నుంచి దూరంగా నేర్చుకునేటప్పుడు వారి సంరక్షణలో స్టడీ గ్రూప్ అనుభవ సంపదను నిర్మించింది. ఈ మహమ్మారి అనంతర ప్రపంచంలో వారి అభ్యాసానికి మొదటి ప్రాధాన్యం ఉంది. విద్యార్థి సమాజ ఆరోగ్యం దిశగా ఇది మంచి నిర్ణయం’ అని వారు పేర్కొన్నారు.


Previous
Next Post »
0 Komentar

Google Tags