Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Hyderabad Metro Services from today


Hyderabad Metro Services from today
నేటి నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు
అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నేటి నుంచి హైదరాబాద్ లో మెట్రో రైలు కూతపెట్టనుంది. కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెట్రో స్టేషన్లలో, రైళ్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7 నుంచి మెట్రో రైల్ సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రయాణికులు మెట్రో స్టేషన్ లోకి వచ్చిన వెంటనే ధర్మల్ స్క్రీనింగ్, శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రతీ ప్రయాణికుడిని ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తామని సిబ్బంది చెబుతున్నారు. కోవిడ్-19 విస్తరిస్తుండడంతో మెట్రో స్టేషన్లలో టోకెన్ల జారీ ప్రక్రియను పూర్తిగా రద్దు చేశారు. స్మార్టు కార్డు లేదా ఆన్లైన్ లో బుక్ చేసుకుని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణించే అవకాశం కల్పించారు. కౌంటర్ వద్దక వాడా భౌతికదూరం పాటించే విధంగా మార్కింగ్ చేశారు. రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. మెట్రో సిబ్బందికి పీపీఈ కిట్లు సమకూర్చారు. సీసీటీవల ద్వారా ఎప్పటికప్పుడు ప్రయాణికుల రాకపోకలను గమని స్తూ భౌతిక దూరం పాటించని వారిని అప్రమత్తం చేసే మని అధికారులు వెల్లడించారు. రైళ్లలో సీటింగ్ విధానంలో కూడా మార్పులు చేశారు. ప్రతి బోగీలో ప్రయాణికులు నిల్చునే, కూర్చునే చోట మార్కింగ్ వేశారు.
Previous
Next Post »
0 Komentar

Google Tags