It is better to eat one egg a day. Can I eat one more egg and more?
It is better to eat one egg a day. Can I
eat one more egg and more?
రోజు కి ఒక గుడ్డు తింటే మంచిది. మరి
ఒక కోడిగుడ్డు చాలా, ఇంకా ఎక్కువ తినవచ్చా..?
మార్కెట్లో లభించే అన్ని ఆహారాలు
కలుషితం కావొచ్చేమోగానీ గుడ్డు మాత్రం కలుషితం కాదు. గుడ్డు పైన గట్టి పెంకు
ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఇది కలుషితం కాదు. ఇక మనం రోజూ రకరకాల ఆహారాలు
తీసుకుంటాం కదా. అవి జీర్ణమై వాటిని మన శరీరం గ్రహించి, వినియోగించుకునే
క్రమంలో చాలా వ్యర్థాలు బయటకుపోతాయి. కానీ గుడ్డు మాత్రం నూటికి నూరు శాతం మన
శరీరానికి ఉపయోగపడుతుంది. మరే ఆహార పదార్థం ఇంత మంచి లాభాల్ని ఇవ్వదు. కోడిగుడ్ల
ద్వారా మనకు అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వీటిల్లో మనకు శరీరానికి కావల్సిన
శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్,
విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం వంటి కీలక పోషకాలు ఉంటాయి. వీటితో మనకు పలు రకాల అనారోగ్య
సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే నిత్యం ఒక కోడిగుడ్డును తినమని వైద్యులు
చెబుతారు.
మరి ఒక కోడిగుడ్డు చాలా, ఇంకా
ఎక్కువ తినలేమా..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక కోడిగుడ్డును ఉడకబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా
తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఎందుకంటే పచ్చ సొనను కలిపితే మనకు నిత్యం అందే డైటరీ
కొలెస్ట్రాల్‌లో 55 శాతం వరకు అందుతుంది. కనుక అది మన
శరీరానికి మంచి చేస్తుంది. కాబట్టి రోజుకు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినవచ్చు.
అయితే ఎక్కువ తినాలనుకుంటే మరో
రెండు ఉడకబెట్టిన గుడ్లను తినవచ్చు. కానీ వాటిల్లో పచ్చ సొన తినరాదు. కేవలం
తెల్లనిసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక
మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి
తినకుండా ఉంటే బెటర్. అయితే ఆరోగ్యవంతులెవరైనా రోజుకు ఒక కోడిగుడ్డును
(పచ్చనిసొనతో కలిపి) నిర్భయంగా తీసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకర ప్రయోజనాలే
కలుగుతాయి..!
You may also like these Posts
0 Komentar