Do you have thigh muscles or leg cramps
while sleeping?
Nocturnal leg cramps
నిద్ర పోతున్నప్పుడు తొడ కండరాలు
లేదా కాలి పిక్కలు పట్టేస్తున్నాయా ?
1. తొడ కండరాలు లేదా కాలి
పిక్కలు పట్టేసినప్పుడు ఆ ప్రదేశంలో ఐస్ గడ్డ\లు కలిగిన
ప్యాక్‌ను కొంత సేపు ఉంచాలి. నొప్పి తగ్గేంత వరకు ఇలా చేయాలి. దీంతో ఆ సమస్య
నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, ఆవ నూనెలను సమభాగాల్లో తీసుకుని
మిశ్రమంగా చేసి దాన్ని వేడి చేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని సమస్య ఉన్న ప్రదేశంలో
రాస్తూ సున్నితంగా మర్దనా చేయాలి. దీంతో బిగుసుకుపోయిన కండరాలు సాగుతాయి. నొప్పి
తగ్గుతుంది.
3. కొబ్బరినూనె కొంత
తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేయాలి. అనంతం ఆ మిశ్రమాన్ని వేడి చేయాలి. దీన్ని
గోరు వెచ్చగా ఉన్నప్పుడు సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. ఇలా చేయడం వల్ల కూడా సమస్య
నుంచి బయట పడవచ్చు.
4. సాధారణంగా చాలా మందికి
డీహైడ్రేషన్ సమస్య వస్తుంటుంది. నీరు తగినంతగా తాగకపోతే ఇలా జరుగుతుంది.
డీహైడ్రేషన్ వచ్చినప్పుడు తొడ కండరాలు లేదా పిక్కలు పట్టేస్తాయి. అలాంటప్పుడు
తగినన్ని నీరు తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. శరీరంలో తగినంతగా
పొటాషియం లేకపోయినా ఇలా జరుగుతుంది. అలాంటి వారు పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు
తదితర ఆహారాలను తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుంది.
0 Komentar