Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Relaxation of rules in IIT and NIT admissions - Center good news for students



Relaxation of rules in IIT and NIT admissions - Center good news for students
విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాల్లో నిబంధనలు సడలింపు..!
ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను కొంత సడలించారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో చేరాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్‌. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను కొంత సడలించారు. దీంతో అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభించింది. మామూలుగా.. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్‌ 20 పర్సంటైల్‌ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
  
కరోనా నేపథ్యంలోనే..!
కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్‌లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.

ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్‌లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్‌లో మెరిట్‌ సాధించి ఉండాలి. కరోనా కారణంగా ఈ ఏడాది అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌ చేయవచ్చు. ధ్రువపత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags