Seven Indians in Top American Rich
People
అమెరికా కుబేరుల్లో ఏడుగురు
భారతీయులు
అమెరికాలో భారతీయ కుబేరులు
రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఫోర్బ్స్ పత్రిక రూపొందించిన తాజా జాబితానే ఇందు కు
ఉదాహరణ. అమెరికాలోని 400 కుబేరుల జాబితాలో ఏడుగురు ప్రవాస
భారతీయులకు చోటు లభించింది. సైబర్ సెక్యూరిటీ సేవల సంస్థ జెడ్ స్కేలర్ సీఈఓ జై
చౌదరి, సింఫనీ టెక్నాలజీస్ గ్రూప్ చైర్మన్ రమేశ్ వాద్వానీ,
ఆన్ లైన్ హోమ్ గూడ్స్, రిటైల్ సంస్థ ఎఫెయిర్
వ్యవస్థాపకుడు, సీఈఓ నీరజ్ షా, వెంచర్
క్యాపిటల్ సంస్థ ఖోస్లా వెంచర్స్ వ్యవ స్థాపకుడు వినోద్ ఖోస్లా, షెర్పాలో వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ కవిటాంక్ రామ్ శ్రీరామ్, ఎయిర్‌లైన్స్ బిజినెస్లో ఉన్న రాకేశ్ గంగ్వాల్, వర్క్
డే సీఈఓ అనిల్ భు^.. ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు.
మళ్లీ బెజోస్ కే అగ్రస్థానం:
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వరుసగా మూడో ఏడాది
అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఏడాది జూలై 21 నాటికి బెజోస్ సంపద నికర
విలువ 17,900 కోట్ల డాలర్లు. ప్రస్తుత డాలర్రూపాయి మారకం
రేటు ప్రకారం చూస్తే ఇది దాదాపు రూ.13.24 లక్షల కోట్లకు
సమానం. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (11,100
కోట్ల డాలర్లు), ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్
(8,500 కోట్ల డాలర్లు), వారెన్ బఫెట్ (7,350 కోట్ల డాలర్లు), ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ (7.200 కోట్ల డాలర్లు) తర్వా తి స్థానాల్లో నిలిచారు.
కుంగిన ట్రంప్ సంపద: అమెరికా
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు మాత్రం ఈసారి నిరాశే మిగిలింది. గత ఏడాది ఫోర్బ్స్
లిస్టులో 310 కోట్ల డాలర్లతో 275వ స్థానంలో
ఉన్న ట్రంప్ ఈ ఏడాది 352వ స్థానానికి పడిపోయారు. ఏడాది కాలం
లోనే ట్రంప్ ఆస్తుల విలువ 60 కోట్ల డాలర్లు హరించుకుపోయింది.
కరోనా దెబ్బ తో ట్రంప్ కుటుంబ నిర్వహణలోని వ్యాపారాలు దెబ్బతినటమే ఇందుకు కారణం.
0 Komentar