Symptoms after recovery from Covid-19 - Still these are mandatory: Govt
కోవిడ్-19
నుంచి కోలుకున్నా కొన్ని లక్షణాలు, ఇవి తప్పనిసరి: కేంద్రం
కీలక సూచనలు
కరోనా వైరస్‌కు టీకా కోసం ముమ్మర
ప్రయోగాలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేలోపు మహమ్మారి వ్యాప్తిని
అడ్డుకోడానికి మాస్క్ ధరించడం, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని
నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా బాధితులకు మార్గదర్శకాలు
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి
విజృంభణ కొనసాగుతోంది. రోజుకు సగటున 90వేలకుపైగా పాజిటివ్
కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు సంబంధించి కేంద్ర
ఆరోగ్య శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్-19
నుంచి కోలుకున్నప్పటికీ కొన్ని రోజులపాటు అలసట, ఒళ్లునొప్పులు,
దగ్గు, జలుబు, ఊపిరి
తీసుకోవడంలో ఇబ్బంది తదితర సమస్యలు ఉంటాయని తెలిపింది. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. కానీ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే
అవకాశముందని పేర్కొంది.
కోవిడ్-19
నుంచి కోలుకున్న తర్వాత తప్పనిసరిగా వ్యాయామం చేయాలని, వ్యాధి
నిరోధకశక్తిని పెంపొందించే చవాన్ ప్రాష్ వంటి ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలని
సూచించింది. గుండె పని తీరు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను
తరచూ పరీక్షించుకోవాలని హెచ్చరించింది. ఎప్పటిలాగే మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతికదూరాన్ని పాటించం తప్పనిసరి
అని పేర్కొంది. గోరువెచ్చటి నీరును ఎప్పటికప్పుడు తగినంత తాగాలని సూచించింది.
హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా
బాధితుల్లో జర్వం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భరించలేని గుండె నొప్పి లక్షణాలు కనిపిస్తే ముందే గుర్తించి, ఆలస్యం చేయకుండా సమీపంలోని వైద్యులను సంప్రదించాలని కోరింది. అంతేకాదు,
ఇప్పటికే మహమ్మారి నుంచి కోలుకున్నవారు తమ అనుభవాలను చుట్టుపక్కల
ప్రజలకు, మీడియాకు, స్థానిక నేతలో
పంచుకోవాలని సూచించింది. తద్వారా కరోనాపై ప్రచారంలో ఉన్న కొన్ని అపోహలను
నియంత్రించే అవకాశముందని కేంద్రం వివరించింది.
కోవిడ్ నుంచి కోలుకోవడం.. స్వాంతన
కోసం స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ లేదా స్వచ్ఛంద సంస్థలు, వృత్తినిపుణుల సహకారం తీసుకోవాలని మార్గదర్శకాల్లో వివరించింది. ప్రస్తుతం
దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 47 లక్షలు దాటింది.
0 Komentar