Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Why do mosquitoes bite certain people? Mosquitoes flee to these smells



Why do mosquitoes bite certain people? Mosquitoes flee to these smells
దోమలు కొందరినే ఎక్కువగా ఎందుకు కుడతాయి? ఈ వాసనలకు దోమలు ఫసక్..
దోమలు వేదిస్తున్నాయా? అయితే.. ఈ చిట్కాలను పాటించి చూడండి. తప్పకుండా దోమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

రోజూ దోమలు చంపేస్తున్నాయా? రక్తాన్నీ పీల్చేస్తున్నాయా? జాగ్రత్త.. దోమ కాటుపై అస్సలు అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే.. దోమకాటు అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో దోమల నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంట్లో లేదా మురుగు కాలువలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే, ఇంట్లో దోమలను తరిమేందుకు మస్కిటో రిపెల్లెంట్స్ వాడండి. అయితే, వీటిలో కొన్ని రసాయనాల వల్ల దోమలకు మాత్రమే కాదు.. మనుషులకు కూడా ఇబ్బందే. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతోనే దోమలను తరిమేయొచ్చు. ఎందుకంటే దోమలకు కొన్ని వాసనలు అస్సలు పడవు. ఆ వాసన వస్తే చాలు.. దెబ్బకు పారిపోతాయి. వాటి గురించి తెలుసుకొనే ముందు.. దోమలు ఎలాంటి వాసనలను ఇష్టపడి మన వద్దకు వస్తాయో తెలుసుకుందాం.

ఇలా ఉంటే దోమలు ఆకర్షిస్తాయి:
అందరూ దోమలను ఆకర్షించలేరు. అవి కొంతమందిని మాత్రమే ఎక్కువగా వేదిస్తుంటాయి. పరిశోధనల ప్రకారం.. 85 శాతం మంది జన్యు కారణాల వల్ల దోమ కాటుకు గురవ్వుతున్నారట.
మీలో జీవక్రియ రేటు ఎక్కువగా ఉండి.. అధిక కార్బన్ డై ఆక్సెడ్‌ను విడుదల చేస్తున్నట్లయితే దోమలు మీ చుట్టూ తిరుగుతాయి.
పూల సువాసనగల సెంట్లకు దోమలు ఆకర్షణకు గురవ్వుతాయి. కాబట్టి.. వీలైనంత వరక సెంట్లకు దూరంగా ఉండండి.
టైప్ ‘O’ బ్లడ్ గ్రూప్ గలవారిని దోమలు ఎక్కువగా కుడతాయని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ టెక్నాలజీ ఆఫ్ చీబా పరిశోధనలో తేలింది.
చెమట సమస్యతో బాధపడేవారిని దోమలు ఎక్కువగా వేదిస్తాయి. శరీరంలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్‌కు దోమలు అట్రాక్ట్ అవుతాయి. అలాగే, వేడి శరీరం గల వ్యక్తులను సైతం దోమలు వెంటాడుతాయి.

ఈ వాసనలకు దోమలు పరార్:

వెల్లులి: ఔనండి.. వెల్లులి వాసన మనుషులకే కాదు.. దోమలకు కూడా ఇష్టం ఉండదు. వెల్లులి మెత్తగా చూర్ణం చేసి దోమలు ఎక్కువగా ఉండే చోట్లలో పెట్టండి. దెబ్బకు పారిపోతాయి. నిమ్మకాయ ముక్కల్లో లవంగాలు గుచ్చడం ద్వారా కూడా దోమల నుంచి ఉపశమనం లభిస్తుంది.

తులసి: పవిత్రమైన ఈ మొక్క ఆకుల వాసన ఎంతో కమ్మగా ఉంటుంది. అయితే, దోమలకు మాత్రం వెగటు పుట్టిస్తుంది. తులసి ఆకుల నుంచి తీసే నూనె ఉపయోగించడం ద్వారా దోమల బారి నుంచి తప్పించుకోవచ్చు. తులసి నూనెను గదిలో అక్కడక్కడ చల్లడం ద్వారా దోమల బెడద నుంచి గట్టెక్కవచ్చు.

పుదీనా: ఈ ఆకుల వాసన కూడా చాలా బాగుంటుంది. పుదీనా నూనె దోమలను తరిమి కొడుతుంది. తులసి నూనె తరహాలోనే దీన్ని కూడా వాడండి.

నిమ్మగడ్డి: దీని గురించి మీరు తక్కువగా విని ఉంటారు. దోమలను తరిమి కొట్టే ఈ గడ్డి మీకు ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది. అయితే, ఈ గడ్డి నుంచి తీసిన సిట్రోనెల్లా నూనె (నిమ్మ నూనె) దోమలను తరిమేస్తుంది. గదిలో అక్కడక్కడ చల్లితే దోమల బాధ ఉండదు.

కర్పూరం: తలుపులన్నీ మూసి కర్పూరం వెలిగించండి. 30 నిమిషాల తరువాత తలుపులు తెరిస్తే.. ఒక్క దోమ కూడా ఉండదు. బయట దోమలు లోపలికి రావు.

Previous
Next Post »
0 Komentar

Google Tags