Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: EAMCET-2020 Another Chance for those who did not write EAMCET due to COVID



TS: EAMCET-2020 Chance for those who did not write exam due to COVID
కరోనాతో ఎంసెట్‌ రాయకుంటే దరఖాస్తు చేసుకోండి
గత నెలలో జరిగిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలకు కరోనా కారణంగా హాజరుకాలేని వారు ఈ నెల 5వ తేదీలోపు తగిన ఆధారాలను పంపించి దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 14ల మధ్య కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మళ్లీ పరీక్ష జరుపుతామని పేర్కొన్నారు. ఎంసెట్‌ వెబ్‌సైట్‌లోని అండర్‌టేకింగ్‌ ఫామ్‌ కొవిడ్‌-19 పాజిటివ్‌ క్యాండిడేట్స్‌ అనే పత్రాన్ని పూర్తి చేసి పాజిటివ్‌, నెగెటివ్‌ రిపోర్ట్‌, హాల్‌ టికెట్‌ను ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి లోపు మెయిల్‌కు పంపించాలని ఆయన సూచించారు. అభ్యర్థులు  convenertseamcet2020a@jntuh.ac.in,  convenertseamcet2020b@jntuh.ac.in   అనే మెయిళ్లకు పంపించవచ్చు. పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు
PRESS NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags