Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: DMHO Recruitment 2020 Job Notifications

 

AP:  DMHO Recruitment 2020 Job Notifications

ఏపీలో మరో 156 ఉద్యోగాలు - ఈనెల 16 దరఖాస్తుకు చివరి తేది..!

ఏపీ ప్ర‌భుత్వానికి చెందిన పశ్చిమ గోదావ‌రి జిల్లా డీఎంహెచ్ఓ 156 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్(ఎన్‌హెచ్ఎం) కింద‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి చెందిన పశ్చిమ గోదావ‌రి జిల్లా మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్‌(డీఎంహెచ్ఓ) ఒప్పంద/ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిప‌దిక‌న 156 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో స‌్టాఫ్ న‌ర్సు, స్పెష‌లిస్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులను అక‌డ‌మిక్ మెరిట్‌, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ఆధారంగా భర్తీ చేస్తారు. దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://westgodavari.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

మొత్తం ఖాళీలు: 156

పోస్టులు: స‌్టాఫ్ న‌ర్సు, స్పెష‌లిస్ట్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ టెక్నీషియ‌న్‌, ఫిజియోథెర‌పిస్ట్‌, సోష‌ల్ వ‌ర్క‌ర్‌‌ త‌దిత‌ర పోస్టులున్నాయి.

అర్హ‌త‌: పోస్టును బట్టి ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంట‌ర్మీడియ‌ట్, డిప్లొమా, జీఎన్ఎం/ బీఎస్సీ(న‌ర్సింగ్‌), బ్యాచిల‌ర్స్‌, మాస్ట‌ర్స్ డిగ్రీ, ఎంఎస్‌డ‌బ్ల్యూ/ ఎంఏ, ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తో నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్‌, రూల్ ఆఫ్ రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబన్‌ 16, 2020.

చిరునామా: జిల్లా మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్‌(డీఎంహెచ్ఓ), ఏలూరు, పశ్చిమ గోదావ‌రి.

వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/

DMHO NOTIFICATION

Previous
Next Post »
0 Komentar