Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Group-1 Mains from Nov 2 - Hall tickets Available from Oct 19

APPSC: Group-1 Mains from Nov 2 - Hall tickets Available from Oct 19

వచ్చే నెల 2 నుంచి గ్రూప్-1 మెయిన్స్ - హాల్ టికెట్లు ఈ నెల 19 న

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్ లోని కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. హాల్ టికెట్లు ఈ నెల 19 నుంచి కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించిం ది. అలాగే పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. అభ్యర్థులకు ప్రశ్నపత్రాన్ని ట్యాబ్ ద్వారా ఇవ్వ నున్నట్లు తెలిపింది. ఇది తెలుగు, ఇంగ్లీష్ లో ఉంటుందని.. ట్యాబ్ బేస్ట్ పరీక్ష విధానానికి సంబంధించిన డెమో వీడియోను తమ వెబ్ సైట్లో పెట్టి నట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. అందులోని మార్గదర్శకాలను అభ్యర్థులు పాటించాలని సూచించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags